
దీంతో విజయనరిని కాస్త పక్కన పెట్టి .. 2009లో ఆల్ ఫ్రీ అంటూ చెప్పినప్పటికీ ప్రజలు గెలిపించలేదు.. కానీ 2014 విభజన తర్వాత మళ్లీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు కావాలి అనే అంశంతో గెలిచారు.. కానీ 2019లో మళ్లీ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ పార్టీ సంక్షేమాలు అంటూ పెద్దపీట వేయడంతో ప్రజలు కూడా మక్కువ చూపే ఐదేళ్లు వైసిపి పార్టీకి పట్టాం కట్టారు. మళ్లీ 2024లో.. సూపర్ సిక్స్ హామీలనే కాకుండా కూటమిగా జతకట్టి ఎన్నికలలో గెలవడం జరిగింది.
కానీ 2024లో గెలిచిన తర్వాత తాను చెప్పిన హామీలను పెద్దగా అమలు చేయకపోవడంతో.. చాలా విమర్శలు వినిపించడమే కాకుండా పెద్ద ఎత్తున టిడిపి పార్టీకి మైనస్ గా మారింది. అమరావతి పనులు, పోలవరం పనులు అంటూ ముందుకు సాగాలని చూసిన కానీ సంక్షేమ పథకాల కి పెద్దపీట వేయకపోతే ఇబ్బందులు తప్పవనేలా గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబు చివరికి హామీలను అమర్చే విధంగా అడుగులు వేస్తున్నారు ఇటీవలే తల్లికి వందనం పథకం కూడా అమలు చేశారు.. అలాగే మెగా డీఎస్సీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసేలా ఈ నెలలోనే చేస్తున్నారు.
తాను ఎన్నికల ముందు చెప్పిన హామీలను చేయకపోతే పరిస్థితి అర్థం అయినట్టుగా కనిపిస్తోంది. దీంతో వైసిపి నేత జగన్ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని సంక్షేమ పథకాల వైపుగా దూకుడు పెంచుతున్నారు సీఎం చంద్రబాబు. అయితే దీంతో కొంతమంది పథకాలు అంటూ వాటి వెనక పరిగెత్తితే ఉపయోగముందా అనే చర్చ ఇప్పుడు ఏపీ అంతట మొదలవుతోంది. మరి కొంతమంది మాత్రం ఎవరైనా సరే పథకాలు అమలు కాకపోతే ఇబ్బందులు తప్పవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.