రాజకీయ సమావేశాల పరంగా ఏదైనా జరిగితే అది పెద్ద సంచలనంగానే మారుతుంది. ఒక చిన్న తప్పిదం జరిగినా, ఆ విషయం పెద్ద ఎత్తున రాధాంతానికి దారి తీస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఒక్కటికి నాలుగు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తమిళనాడంతా హీరో విజయ్ దళపతి పేరు ట్రోలింగ్‌కి గురవుతోంది. తమిళనాడులోని కరూర్ జిల్లాలో శనివారం సాయంత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి నిర్వహించిన కార్నర్ మీటింగ్ ఎంతటి దారుణానికి దారితీసిందో అందరికీ తెలిసిందే. ఆ మీటింగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.


ఈ విషయంలో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ స్పందిస్తూ.. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే సీఎం స్టాలిన్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ జరిగినా, చిన్నపిల్లలు, మహిళలు పాల్గొనకూడదు అన్న కొత్త చట్టాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం. అంతేకాదు, సీఎం స్టాలిన్ విజయ్ దళపతి మీద కూడా సీరియస్‌గా ఉన్నారని, ఆయన అరెస్ట్‌కు సంబంధించిన పేపర్లు రెడీ అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.



అయితే, అసలు ఈ దారుణం ఎందుకు జరిగింది? సమావేశ స్థలంలో గరిష్టంగా 10,000 మందికి మాత్రమే కెపాసిటీ ఉందట. కానీ విజయ్ దళపతి మీటింగ్‌కు ఆయన ఆలస్యంగా రావడంతో మొదట 10,000 మంది, తర్వాత 20,000 మంది, చివరికి ఏకంగా 30,000 మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారని చెబుతున్నారు. అందరూ ఒక్కసారిగా విజయ్‌ను చూడాలనే ఆత్రుతతో ముందుకు దూకడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కరు తోసుకుంటే మరొకరు కిందపడిపోవడం, దాంతోపాటు భయాందోళనకు లోనై అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడటంతో ఈ భారీ ప్రాణనష్టం జరిగింది అని అక్కడి ప్రముఖులు చెబుతున్నారు.



ఇక, దీనిపై వాదనలు కూడా వేర్వేరుగా వినిపిస్తున్నాయి.కొంతమంది మాట్లాడుతూ.. “విజయ్ దళపతి ఏం చేసినా పర్ఫెక్ట్‌గానే చేస్తారు. ఈ ఘటనను ఆయనపై మోపడం తగదు. అసలు అపోజిషన్ పార్టీ వాళ్లే కావాలనే ఈ తొక్కిసలాట జరిగేలా ప్రణాళిక రచించారు” అని ఆరోపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. “పోలిటికల్ మీటింగ్‌లకు చిన్నపిల్లలను ఎందుకు తీసుకువెళ్లాలి? పెద్దలు కూడా జాగ్రత్తలు పాటించలేదు” అంటూ తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా మరో సెన్సేషనల్ విషయం సోషల్ మీడియాలో లీకైంది. ఈ మీటింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు నగదు ఇస్తామని స్థానిక నిర్వాహకులు ముందుగానే చెప్పారట. అదే కారణంగా పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ మీటింగ్‌కి తరలివచ్చారని సమాచారం. ఆ అనూహ్య జనసందోహమే చివరకు ఇంతటి ఘోరానికి కారణమైందని చెబుతున్నారు.



మొత్తానికి, నిజనిజాలు ఏవైనా కానీ, సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దళపతిని తీవ్రంగా టార్గెట్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంఘటన తర్వాత రాజకీయ సమావేశాల భద్రతపై కొత్త చర్చ మొదలైంది. ఇకపై తమిళనాడులో మీటింగ్‌లపై ప్రభుత్వం ఏ రకమైన కఠిన చర్యలు తీసుకుంటుందో అన్నది చూడాలి...??

మరింత సమాచారం తెలుసుకోండి: