భారత్ నుండి భార‌తీయులు విదేశాలకు వ‌ల‌స వెళ్లి పోతున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికాకు ఐరోపా దేశాలకు సాఫ్ట్‌వేర్ నిపుణులు గా, వైద్యులుగా వలసతో పాటు ప్రతిభ కూడా తరలి పోతుంది. గ‌ల్ఫ్ దేశాలుకు కార్మికులుగా, ఆఫ్రికా వంటి దేశాలకు నిపుణు లు గా ఉన్న‌త శ్రేణి ఉద్యోగులుగా సేవ‌లు అందించేందుకు వ‌ల‌సవెళుతున్నారు. ఉద్యోగాలు   గుణాత్మక జీవనం, ప్రతిభా ప్రదర్శన తదితరాల పరంగా భారత్ నుండి ప్రతిభ కూడా తరలిపోతుంది.
Image result for migration from india to other countries US Report on Migration

ఇలా వ‌ల‌స వెళ్లిన వారు తాజాగా ఓ రికార్డు సృష్టించారు. విదేశాలకు పెద్ద సంఖ్యలో వలసపోయిన పౌరులున్న దేశాల జాబితా లో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌కు చెందిన కోటి 70 లక్షల మంది విదేశాల్లో వలస పక్షుల్లా నివసిస్తున్నారని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. ఐరాస విడుదల చేసిన ఈ అంతర్జాతీయ వలస నివేదికలో ఏ దేశం నుంచి ఎంత మంది ఏ ఏ దేశాలకు వలస వెళ్లారన్న వివరాలను పొందుపరచింది.
Image result for migration from india to other countries US Report on Migration

ప్రపంచం లోని మిగతా దేశాల కంటే భారత్ నుంచే అహిక సంఖ్యలో అంటే ఒక కోటి 70 లక్షల మంది వలస పోయారని, వారి లో ఒక్క గల్ఫ్ ప్రాంతంలోనే అర కోటి మంది భారతీయ శ్రామికులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది, అమెరికా, సౌదీ అరేబియాలలో 20 లక్షల మంది చొప్పున భారతీయులు నివసిస్తున్నారని నివేదిక తెలిపింది.
Image result for migration from india to other countries US Report on Migration
వలస పోయిన పౌరుల జాబితాలో భారత్ తరువాతి స్థానాల్లో మెక్సికో, రష్యా, చైనా, బంగ్లాదేశ్, సిరియా, పాకిస్థాన్ వంటి దేశాలు ఉన్నాయి. మెక్సికో నుంచి కోటి 30 లక్షల మంది, రష్యా నుంచి కోటి 10 లక్షల మంది, చైనా నుంచి కోటి మంది, బంగ్లాదేశ్, సిరియాల నుంచి 70 లక్షల మంది చొప్పున, పాకిస్థాన్, ఉక్రెయిన్‌ల నుంచి 60 లక్షల మంది చొప్పున వలస పోయారని ఐరాస తెలిపింది. స్వదేశాన్ని వదిలి ఇతర దేశాల్లో నివసిస్తున్న వివిధ దేశాల ప్రజల సంఖ్య మొత్తం 25.80 కోట్లు అని, 2000 సంవత్సరం నుంచి వలసల సంఖ్య 49 శాతం పెరిగిందని ఐరాస అంచనా వేసింది.
Image result for migration from india to other countries US Report on Migration
10 Source Countries with the Largest Populations in the United States as Percentages of the Total Foreign-Born Population: 2011

ఇదిలాఉండ‌గా, అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌తీయులు ప్రత్యేక ముద్ర వేసుకున్నారని ఇటీవ‌లే ఒక నివేదికలో వెల్లడైన సంగ‌తి తెలిసిందే. అమెరికా పౌర‌స‌త్వం పొందిన వారిలో భార‌తీయులు రెండో స్థానంలో నిలిచారు. అగ్ర‌రాజ్యం పొరుగున ఉన్న‌ మెక్సిక‌న్లు తొలి నుంచి స‌హ‌జంగానే ప్ర‌థ‌మ‌ స్థానంలో ఉన్నారు. "యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యురిటీ" విడుద‌ల చేసిన నివేదికలో ఈ అంశాన్ని స్పష్టంగా వెల్ల‌డించారు. ఈ నివేదిక‌ ప్ర‌కారం 2016 ఆర్థిక సంవ‌త్స‌రం అంటే అక్టోబ‌ర్ 1 2015 నుంచి సెప్టెంబ‌ర్ 30 2016వ‌ర‌కు అమెరికా ప్ర‌భుత్వంచే ఆ దేశ పౌర‌స‌త్వం పొందిన మొత్తం విదేశీయులు 7.53 ల‌క్ష‌ల మంది. అందులోలో భార‌తీయులు 6% ఉన్నారు. 

Image result for migration from india to other countries US Report on Migration

మరింత సమాచారం తెలుసుకోండి: