తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ముఖ్యమైన సమస్యలు కొన్ని తలెత్తాయి..అందులో ముఖ్యంగా హైకోర్టు వివాదం. ప్రస్తుతం హైకోర్టు తెలంగాణ హైదరాబాద్ లో ఉంది. అయితే ఇది ఉమ్మడి హైకోర్టు కావడంతో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలనే ప్రస్థావన వచ్చింది. దీనిపై కొంత కాలంగా తర్జన భర్జన జరుగుతూ వస్తుంది. మొత్తానికి ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తయింది. గత నాలుగు రోజులుగా అదిగో.. ఇదిగో అంటున్న విభజన నోటిఫికేషన్ వెలువడింది.
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటును నోటిఫై చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుందని రాష్ట్రపతి ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 214, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 30 (1)(ఏ), 31(1), 31(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన 16 మంది న్యాయమూర్తులు 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరి స్తారు. హైకోర్టు విభజన పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఇతర హామీలను కూడా అమలు చేయాలన్నారు. దేశంలో 25వ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవతరించబోతుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు:
1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.)
2. జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
3. జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి
4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి
5.జస్టిస్ దామా శేషాద్రి నాయుడు (బదిలీపై ప్రస్తుతం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు)
5. జస్టిస్ మంథాట సీతారామమూర్తి
6.జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు
7.జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి
8.జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి
9.జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్
10.జస్టిస్ జవలాకర్ ఉమాదేవి
11.జస్టిస్ నక్కా బాలయోగి
12.జస్టిస్ తేలప్రోలు రజని
13.జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు
14.జస్టిస్ కొంగర విజయలక్ష్మి
15.జస్టిస్ మంతోజు గంగారావు.
తెలంగాణకు కేటాయించిన జడ్జిలు :
1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్
2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీరామచంద్రరావు
3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు
5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి
6. జస్టిస్ బులుసు శివ శంకర్రావు
7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్
8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు
9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్