నాగార్జున హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఇక తెలుగు ప్రేక్షకులు అందరూ చూపులు తన వైపుకు తిప్పుకుంది అని చెప్పాలి. అంతేకాదు తన కోర చూపులతో కుర్ర కారు అందరిని కూడా పగటి కలల్లోకి నెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. ఎంతోమంది హీరోలతో నటించి సూపర్ హిట్ లను ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించుకుంది అనుష్క. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇలా గత 15 నెలలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క ఇక అటు గట్టిగానే ఆస్తులు సంపాదించింది అన్నది తెలుస్తుంది.


 అనుష్క శెట్టి ఆస్తుల విలువ దాదాపు 142 కోట్ల వరకు ఉంటుందట. ఇప్పటికే పలు నగరాల్లో అనుష్కకు విలువైన బంగాళాలు ఆస్తులు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. సొంత ఇల్లు, అపార్ట్మెంట్స్, కార్లు, బంగారు వజ్రాభరణాలు కూడా ఉన్నాయట. ఇటీవల అనుష్క కారు డ్రైవర్ పుట్టినరోజు కానుకగా 12 లక్షల విలువ గల కార్ ను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది జేజమ్మ. దీంతో డ్రైవర్ కే 12 లక్షల గిఫ్ట్ ఇచ్చిందంటే ఇక అనుష్క ఆస్తుల విలువ ఎంతో అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అనుష్క ఉంటున్న ఇంటి విలువ ఏకంగా 12 కోట్ల వరకు ఉంటుందట.

ఇక ఖరీదైన కార్ల విలువ కొన్ని కోట్ల విలువ చేస్తుందట. ఇందులో భాగంగా టొయోటా కొరొల్లా ఆల్టిస్ -21లక్షలు, ఆడి ఏ 6 విలువ- 56 లక్షలు, ఆడి క్యూ 5 - 62 లక్షలు, బీఎండబ్ల్యూ 6 సిరీస్ కార్ - 67లక్షలు పెట్టి కొనుగోలు చేసిందట జేజమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: