ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానం వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియా తో హోరాహోరీగా పోరాడుతుంది. అయితే అద్భుతంగా రానుంచి  టీం ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుంది అనుకుంటే.. మొదటిరోజు ఆట నుంచే కాస్త తడబాటుకు గురవుతుంది అని చెప్పాలి. అయితే భారత బౌలింగ్ విభాగం పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం మాత్రం ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో సూపర్ పర్ఫామెన్స్ చేసి సెంచరీలతో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ లు తక్కువ పరుగులకే చేతులెత్తేస్తున్నారు.


 దీంతో కీలకమైన బ్యాట్స్మెన్ అవుట్ కావడంతో ఇక భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ఎన్నో రోజుల విరామం తర్వాత అటు టీమ్ ఇండియాలో అడుగుపెట్టిన సీనియర్ బ్యాట్స్మెన్ అజంక్య రహానే తన ఆటతీరుతో మరోసారి జట్టును ఆదుకున్నాడు. తాను భారత జట్టుకు ఎంత కీలకమైన ఆటగాడిని అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు అని చెప్పాలి. ఏకంగా 129 బంతుల్లో 86 పరుగులు చేశాడు. దీంతో ఇక భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ అందుకోగలిగింది అని చెప్పాలి. ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా టెస్ట్ ఫార్మాట్ లో 5000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు ఈ సీనియర్ బాట్స్మన్.


 అయితే ఇక అజింక్య రహనే వేలికి గాయం అయింది. ఈ క్రమంలోనే చేతివేలికి టేప్ చుట్టుకుని మ్యాచ్ ఆడాడు. ఒకవైపు గాయం వేదిస్తున్న ఇక జట్టును గెలిపించేందుకు బ్యాటింగ్ చేశాడు. అయితే అటు ప్రాక్టీస్ సమయంలో కూడా వేలికి టేప్ చుట్టుకుని అతడు డే3 ఆటకు ప్రాక్టీస్ చేసినట్లు మాజీ క్రికెటర్ హార్బర్జన్ సింగ్ తెలిపాడు. తనకు ఈ విషయాన్ని భారత జట్టు ఫిజియో చెప్పారు అంటూ తెలిపాడు. ఇలా గాయమైనప్పటికీ జట్టు గెలుపు కోసం పోరాడుతున్న  రహానే డేడికేషన్ చూసి ఇక భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc