ఇప్పుడున్న ప్రపంచంలో కొంతమంది ఎంతో పెద్ద సక్సెస్ లను చూస్తూ ఉంటే,కొంతమంది మనకు ఏమి కలిసి రాదు,మనం నష్ట జాతకలము,అనుకున్న పనులు అసలు జరగదు అని అనుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది పరిశోధకులు మాత్రం కొన్ని లక్షణాలు కలిగిన ఇళ్లలో అస్సలు ఆర్థికంగా కాని,సామాజికంగా అసలు ఎదగరని,వాటిని పోగొట్టుకుంటేనే వారి ఇంటిని నిలబెట్టుకోగలరని హెచ్చరిస్తూ ఉన్నారు.ఎలాంటి లక్షణాలు కలిగిన ఇళ్ళల్లో లక్ష్మీదేవి కూడా నిలవమన్నా నిలవదట.అసలు ఆ లక్షణాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

తెల్లవారుజామున లేవని వారింట్లో..

ఈ మధ్యకాలంలో లేటుగా లేవడం అనేది భలే ట్రెండ్ అయిపోయింది.కానీ అది మాత్రం అస్సలు మంచిది కాదు.ఇప్పటికిప్పుడు బాగా ఉన్నా క్రమంగా ఆర్థికంగా చాలా దెబ్బతింటారని వేద పండితులు చెబుతున్నారు.అంతేకాక తెల్లవారుజామున లేచి,వారి పని వారు చేసుకునే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట.

సుచిశుభ్రత పాటించని ఇంట్లో..

కొంతమంది ఇళ్లల్లో పొద్దున లేవగానే పాచి పనులు చేయకుండా,ఆహారాలు వండుకొని తినడం ఎక్కడ వస్తువులు అక్కడే పడేయడం, వంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ధనం నిలవకుండా చేస్తుందట.

అస్తమానం గొడవలు పడే ఇంట్లో..

కొంతమంది ఇళ్లలోనీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు.దీనివల్ల వారి మధ్య సక్యత తొలిగిపోవడమే కాక,లక్ష్మీదేవికి కూడా  ఆగ్రహం కలిగి నుంచి బయటకు వెళ్లిపోతుంది.క్రమంగా వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అస్తమానం నిద్రించే ఇంట్లో..

కొంతమంది ఇళ్లల్లో ఎవరో ఒకరు అస్తమానం నిద్రిస్తూ ఉంటారు.ఇలాంటి వారు ఇళ్లను తొందరగా దరిద్ర దేవత ఆవహిస్తుందని,దీనితో ఇంట్లో ధనం నిలవదని వేద పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు.

నెగటివ్ మాటలు మాట్లాడే ఇంట్లో..

చాలామంది నిరాశకు ఎప్పుడు నిరాశలో ఉంటూ ఎప్పుడు తమకు ఏమీ చేతకాదని,వారు ఏ పని అనుకున్న సజావుగా జరగదని,వారి పిల్లలు చేయాలనుకున్న పనులు కూడా అడ్డగిస్తూ,వంకలు పెడుతూ,శాపనార్థాలను ఇస్తూ ఉండే వారి ఇంట్లో  అసలు ధనం నిలవదట.కావున మీరు కూడా ఇలాంటి పొరపాట్లు ఏమైనా చేస్తూ ఉంటే,వెంటనే వాటిని నివారించడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: