వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ , భారత్ ల మధ్య  జరిగిన  నాలుగో టీ 20లో  న్యూజిలాండ్ మరో  సారి సూపర్ ఓవర్ లో చిత్తైయింది. ఈమ్యాచ్ లో  మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా 20ఓవర్ల లో  165పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది.  దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. ఇక  సూపర్ ఓవర్ లో  న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 13 పరుగులు చేయగా  ఆతరువాత  ఛేదనలో ఇండియా, రాహుల్ వికెట్ కోల్పోయి  5బంతుల్లోనే  లక్ష్యాన్ని ఛేదించి  విజయం సాధించింది. మూడో టీ 20లోకూడా  సూపర్ ఓవర్ లో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.  
 
ఇక నాల్గో టీ 20లో  టాస్ ఓడిపోయి  బ్యాటింగ్ కు దిగిన  భారత్ కు  శుభారంభం దక్కలేదు. రోహిత్ స్థానం లో ఓపెనర్ గా  అవకాశం దక్కించుకున్న  సంజు సాంసన్ నిరాశ పరిచాడు. కేవలం 8పరుగులే చేసి  రెండో ఓవర్ లోనే వెనుదిరగగా ఆతరువాత కోహ్లీ,  శ్రేయస్ అయ్యర్,  శివమ్ దూబే  కూడా ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే  రాహుల్ తన ఫామ్ ను కొనసాగిస్తూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. అయితే 39పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద  రాహుల్(39) అవుట్ కావడం తో  భారత్ కష్టాల్లో పడింది.   ఈ దశలో శార్దూల్ ఠాకూర్ తో కలిసి  మనీష్ పాండే ఇన్నింగ్స్ ను నిర్మించాడు. వేగంగా ఆడే క్రమంలో  శార్దూల్(20) వెనుదిరిగినా  చివరి వరకు అజేయంగా నిలిచి  హాఫ్ సెంచరీ తో  మనీష్ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ ను అందించాడు.  అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కివీస్  .. ఓపెనర్ గప్తిల్ వికెట్ తొందరగానే కోల్పోయిన మున్రో(64) , సైఫర్ట్(57)  స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. వీరి జోరుకు  కివీస్ గెలుపు ఖరారునుకున్న తరుణం లో వెను వెంటనే వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. ఇక చివరి ఓవర్ లో 6 పరుగులు చేయాల్సిఉండగా ఒత్తిడికి గురై 5పరుగులే చేసి టై చేసుకుంది. ఆతరువాత సూపర్ ఓవర్ లో ఓటమిని చవిచూసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: