క్రికెట్ అభిమానులు ఎంతో ఆశ గా ఎదురుచూస్తున్న టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ దుబాయ్ - యూఏఈ వేదికగా ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా జరుగుతోంది. ముందుగా సూపర్ 12 కు అర్హత పొందడం కోసం ఎనిమిది జట్లు గ్రూప్ ఏ , గ్రూప్ బీ గా విడిపోయి అర్హత మ్యాచ్ ల‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఈ అర్హత స్థాయి పోటీలు ముగుస్తాయి. రేపటి నుంచి సూపర్ 12 లో భాగంగా అసలు సిసలు సమరం ప్రారంభమవుతుంది. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

అయితే అర్హ‌త మ్యాచ్ ల ద్వారా సూప‌ర్ 12కు అర్హ‌త పొందే జ‌ట్ల విష‌యంలో దాదాపు గా క్లారిటీ వ‌చ్చేసింది. గ్రూప్ బి నుంచి మూడు విజ‌యాల‌తో స్కాట్లాండ్ తో పాటు రెండు విజ‌యాల‌తో బంగ్లాదేశ్ సూప‌ర్ 12కు వెళ్లాయి. ఇక ఈ గ్రూప్ నుంచి ఒమ‌న్‌, ప‌పువా న్యుగిని యా ఇంటి ముఖం ప‌ట్టేశాయి. గ‌త రాత్రి బంగ్లాదేశ్ ప‌పువా న్యుగినియా పై భారీ ఆధిక్యంతో విజ‌యం సాధించి ప్ర‌పంచ క‌ప్‌లో సూప‌ర్ 12 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక స్కాట్లాండ్ సంచ‌ల‌న ఆట‌తో మూడు విజ‌యాలు సాధించింది.

ఇక గ్రూప్ ఏ విష‌యానికి వ‌స్తే శ్రీలంక ఇప్ప‌టికే సూప‌ర్ 12కు వెళ్లింది. ఈ రోజు శ్రీలంక నెద‌ర్లాండ్స్ తో జ‌రిగే మ్యాచ్ లో ఓడిపోయి నా కూడా సూప‌ర్ 12 కు వెళుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో ఐర్లండ్ వ‌ర్సెస్ న‌మీబియా జ‌ట్ల మ‌ధ్య విన్న‌ర్ సూప‌ర్ 12కు వెళుతుంది. ఈ గ్రూప్ నుంచి ఇప్ప‌టి కే నెద‌ర్లాండ్స్ ఇంటి ముఖం ప‌ట్టేసింది. ఇక శ్రీలంక త‌ర్వాత రెండో జ‌ట్టు గా ఏది సూప‌ర్ 12కు వెళుతుందో ఐర్లండ్ - న‌మీబి యా మ్యాచ్ డిసైడ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: