భారత క్రికెట్ లో యంగ్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న శుభమన్ గిల్ ప్రస్తుతం ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనతో పాటు దేశవాళి క్రికెట్ ఆడిన ప్లేయర్స్ ఎవరూ కూడా ప్రస్తుతం శుభమన్ గిల్ కు చేరువలో లేరు టీమిండియా జట్టులో అటు మూడు ఫార్మాట్ ల ప్లేయర్ గా కూడా సత్తా చాటుతూ ఉన్నాడు శుభమన్ గిల్. తన ఆటతీరుతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. ఇక అతను బ్యాటింగ్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే సెంచరీలు చేయడం ఇంత సులభమా అనే భావన సగటు ప్రేక్షకుడిలో కలుగుతుంది.


 మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ శుభమన్ గిల్.. ఇక భారత క్రికెట్ ఫ్యూచర్ అనే నమ్మకాన్ని.. ప్రతి ఒక్కరిలో కలిగిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో తానేంటో నిరూపించుకున్న శుభమన్ గిల్.. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో కూడా సెంచరీ తో చెలరేగి పోయాడు. వరుసగా మ్యాచ్ లలో సెంచరీలు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు శుభమన్ గిల్. భారత క్రికెట్ లో ఫ్యూచర్ సచిన్, విరాట్ కోహ్లీ అంటూ ఎంతోమంది దిగ్గజాలతో గిల్ ను పోలుస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ గ్యారి కిర్ స్టెన్  కీలక వ్యాఖ్యలు చేశాడు. కెరియర్ ప్రారంభ దశలో కీలకమైన ఫామ్ కనబరుస్తున్న శుభమన్ గిల్ ఇప్పుడే సచిన్, విరాట్ కోహ్లీ లాంటి దిగజాలతో పోల్చవద్దు అంటూ గ్యారి అభిప్రాయపడ్డాడు. పలువురు మాజీలు గిల్ ను సచిన్ విరాట్ కోహ్లీతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే శుభమన్ గిల్ కు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసే సత్తా ఉందని ప్రశంసలు కురిపించాడు. అయితే క్రికెట్లో ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలని అప్పుడే అత్యుత్తమమైన ఫామ్ కొనసాగించే ఛాన్స్ ఉంది అంటూ చెప్పకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: