మహిళా దినోత్సాన్ని పురస్కరించుకుని కొంత మంది ప్రముఖులు వినూత్న కార్యక్రమాలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. మరి కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి తన బాధ్యతలను ఓ మహిళా కానిస్టేబుల్ కు అప్పగించారు. హోమ్ మంత్రి నారోత్తం మిశ్రా ఆయన కార్యాలయంలో డ్యూటీ చేస్తున్న మీనాక్షి వర్మ కు ఒక్కరోజు హోమ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నారోత్తం మిశ్రా మాట్లాడుతూ...అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నా బాధ్యతలను మీనాక్షి వర్మకు అప్పగించానని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్త్రీని  ఒక భారత దేశంలో మాత్రమే అమ్మ లాగా గౌరవిస్తరని మంత్రి అన్నారు.

అంతే కాకుండా మహిళకు అమ్మ స్థానం కట్టబెట్టిన దేశం కూడా భారత దేశమేనని అన్నారు. మరేదేశమైనా చూడండి అక్కడ మహిళలకు అలాంటి గౌరవం ఇస్తారా అది పాకిస్థాన్ అయినా మరే దేశమైనా మనలా గౌరవిస్తుందా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో మహిళలు గౌరవం ఇవ్వడం భాగం..అదే మన సాంప్రదాయమని అన్నారు.  ఇక ఒక్కరోజు హోమ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి వర్మ ప్రజా సమస్యలను తెలుసుకోనుంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఉత్తరాఖండ్ కు చెందిన ఓ యువతి ఒక్క రోజు ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టి వార్తల్లో నిలిచింది. జనవరి 24న ఉత్తరాఖండ్ రాజధాని నుండి సృష్టి గోస్వామి అనే యువతి ఒక్కరోజు సీఎం గా బాధ్యతలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరంగా తెలుసుకుంది. హరిద్వార్ జిల్లా దౌలతాపూర్ కు చెందిన సృష్టి రూర్కీ లోని అగ్రికల్చర్ బీఎస్సి చదువుతోంది. ఇక ఇప్పుడు తాజాగా మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సృష్టి గోస్వామి హోం మినిస్ట‌ర్ గా భాద్య‌త‌లు చేప‌ట్టి వార్త‌ల్లో నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: