దేశంలో అత్యంత గొప్ప కార్ మేకర్ మోటార్ సంస్థగా పేరు గాంచిన మారుతి సుజుకి మోటార్స్ ఆగస్టు నెల సేల్స్ రిపోర్ట్ లో తన సత్తా చాటింది. ఆగస్టు నెల మొత్తం 12.2 శాతం వృద్ధి రేటు సంపాదించింది మారుతి మోటార్స్. మధ్యతరగతి కార్ గా ప్రాముఖ్యత సంపాదించిన మారుతి ఎప్పటికప్పుడు కస్టమర్ల ప్రాధాన్యత దృష్ట్యా మెరుగైన సేవలతో అందుబాటులో ఉంది.

 

ఇక మారుతి తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న మోటార్ కంపెనీ హ్యుండై.. 43,201 యూనిట్ సేల్స్ తో ఈ నెల సేల్ రిపోర్ట్ లో 6.2 వృద్ధి రేటుని సంపాదించింది హ్యుండై మోటార్స్. హ్యుండై కంపెనీ కార్లు కూడా కష్టమర్స్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యానే తమ ప్రొడక్ట్స్ ఏర్పాటుచేయడం జరుగుతుంది.


ఇక థర్డ్ ప్లేస్ లో మహింద్రా కార్లు, నాలుగో ప్లేస్ లో టాటా మోటార్స్ మెరుగైన సేల్ రిపోర్ట్ కలిగి ఉన్నాయి. ఇక ఆ తర్వాత స్థానంలో నిస్సాన్, టొయోటా, వోక్స్ వాగన్ కార్లు ఉన్నాయి. ఇక లాస్ట్ మంథ్ లో హోండా కార్ల సేల్ రిపోర్ట్ అంత గొప్పగా ఏం లేదు. ఓ విధంగా చెప్పాలంటే అది లాస్ లోనే నడించిందని అనాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: