టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పై కాసేపటి క్రితం జరిగిన దాడి సంచలనంగా మారింది.. గడ్డ మణుగూరు కొండూరు ఫారెస్ట్ లో మైనింగ్  అవకతవకలను పరిశీలించటానికి వెళ్లిన దేవినేని ఉమా పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ దాడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన దేవినేని ఉమ తనపై దాడి వ్యూహాత్మకంగా జరిగిందని వైసీపీ కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే పంపించారని ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయని తనను వైసీపీ కార్యకర్తలు నిర్బంధించారని దేవినేని ఉమ ఆరోపించారు. 


అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు లేదా అనేదానిపై ఇంకా పూర్తి సమాచారం మీడియాకు అందలేదు. ఈ అడవిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి దేవినేని ఉమ గత కొన్ని రోజులుగా స్థానిక ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనా స్థలానికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీడియాకు కూడా ఇంకా పూర్తిగా సమాచారం అందలేదని మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునే పరిస్థితి లేదని దేవినేని ఉమా అంటున్నారు. తను మావోయిస్టుల తరహాలో వైసిపి కార్యకర్తలు దాడి చేశారని ఉమా ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. గాయపడిన కొందరిని ద్విచక్ర వాహనాలపై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: