కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసిన వైసిపి మహిళా ఎంపిలు… దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. హోం శాఖ,న్యాయ శాఖలకు దిశ బిల్లుకు సంబంధించిన వివరాలు ఇప్పటికే అందజేశాం అని వారు కేంద్ర మంత్రికి వివరించారు. మహిళలకు,శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం అన్నారు. మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా బిల్లు రూపొందించాం అని పేర్కొన్నారు.

మహిళా సంక్షేమానికి జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారు అని ఎంపీలు కొనియాడారు. మా విజ్ఞాపనలపై స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారన్న ఎంపీలు మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను స్మృతి ఇరానీ ప్రసంశించారు అని మీడియాకు వివరించారు. కాగా ఏపీలో దిశా చట్టంపై కేంద్రం నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: