వాతావరణ మార్పులతో ప్రపంచంలో అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. ఆకస్మిక వరదలు వాటిలో ఒకటి. ఇప్పుడు పాకిస్తాన్ లో అదే జరుగుతోంది. కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాకిస్తాన్ వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పాకిస్తాన్‌ వ్యాప్తంగా వరదల కారణంగా 1150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 16వందల మంది గాయపడ్డారు. 10.5 లక్షల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. 7 లక్షలకుపైగా పశువులు చనిపోయాయి. దాదాపు 20 లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగింది.


వరద ముంపు ప్రాంతాల నుంచి 3.3కోట్ల మందిని ఖాళీచేయించారు. వరదలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై 10 బిలియన్ డాలర్ల ప్రభావం పడిందని ఆ దేశం చెబుతోంది. పాకిస్తాన్‌ను పునర్నిర్మించేందుకు కనీసం ఐదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సింధ్‌, బలోచిస్థాన్‌, ఖైబర్‌ పక్తుంఖ్వాలో వరదల ప్రభావం దారుణంగా ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు పాక్‌ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: