జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.ఏపీలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, తెలంగాణలోనూ అప్పుడప్పుడు వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకంగా ఏపీలో అధికారం దక్కించుకుని సీఎం కుర్చీలో కూర్చోవాలని పవన్ ఆరాటపడుతున్నారు. ఎలాగూ బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి, తన కల నెరవేరే సమయం మరెంతో దూరంలో లేదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు గా కనిపిస్తున్నారు. పవన్ మొదటిగా వేసిన రాజకీయ అడుగులు తప్పటడుగులుగా మారడంతో ఏపీ తెలంగాణలో పవన్ బలపడలేకపోయారు కోట్లాది మంది అభిమానులు, బలమైన సామాజిక వర్గం అందండలు పుషకాలంగా ఉన్నా, పవన్ రాజకీయం గా సక్సెస్ కాలేకపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అయినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా పవన్ వ్యవహరించలేకపోతున్నారు అనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా, పెద్దగా ఉపయోగంలేనట్టుగానే ఏపీలో పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ ను పక్కన పెట్టి జగన్ వైపు బిజెపి చూస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఆయనకు ఎదురవుతోంది. ఇక పవన్ ఎక్కువగా వైసీపీ ని టార్గెట్ చేస్తూ, విమర్శలు చేస్తూ వస్తుండడంతో పవన్ పై జనాల్లో మరింతగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ బాబు మనిషని, ఆయనకు అనుకూలంగానే ఎప్పుడు వ్యవహరిస్తారనే విమర్శలను పవన్ ఎదుర్కోవాల్సి వస్తోంది.


అప్పుడప్పుడు మాత్రమే ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ, చుట్టపుచూపుగా హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తూ పవన్ వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలు కలిగిస్తున్నాయి. వరుసగా సినిమాల్లో నటించేందుకు పవన్ సంతకాలు చేయడం వంటి వ్యవహారాలతో ఆయన రాజకీయాలు పార్ట్ టైం మాత్రమే తప్ప, ఫుల్ టైమ్ కాదు అనే పరిస్థితి కనిపిస్తోంది. 2014 బిజెపి టిడిపి కూటమికి మద్దతు పలికారు ఆ తర్వాత అయినా పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు అంటే అది లేదు . అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపైనే విమర్శలు చేసేందుకు పవన్ మొగ్గు చూపించారు.


ఇటువంటి ఎన్నో వ్యవహారాలు చూస్తే, పవన్ రాజకీయ గందరగోళంలో ఉంది అనే అనుమానాలు అందరిలోనూ బలపడిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ తెలంగాణ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన పవన్, తెలంగాణలో కోటి రూపాయలు విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయని పవన్, ఏపీలో మాత్రం అదేపనిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు.


ఈ విషయంలో తమ మిత్రపక్షమైన బీజేపీ సైతం మౌనంగానే ఉన్నా, పవన్ మాత్రం వైసీపీ పై విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు మాదిరిగానే పవన్ రెండు విధాలుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్  ను విమర్శిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటుందో పవన్ కు బాగా తెలుసు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: