ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల్లో వైసీపీ సత్తా కొనసాగించింది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో ఒక్క దర్శి మినహా దాదాపు అన్నీ గెలుచుకుంది. అన్నింటి కంటే ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజక వర్గంలో వైసీపీ టీడీపీ ని చిత్తు చిత్తుగా ఓడించింది. ఇక్కడ మొత్తం 25 వార్డులు ఉంటే.. టీడీపీ కేవలం ఆరు వార్డుల్లోనే గెలిచింది. ఇంత దారుణంగా టీడీపీ ఓడిపోతుందని టీడీపీ శ్రేణులు ఊహించలేదు. ఇక నెల్లూరు కార్పొరేషన్ సంగతి మరీ దారుణం.. అక్కడ మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. కానీ.. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది.


టీడీపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చిత్తు అయ్యిందంటున్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అవును.. మరి ఆయన వాదన ఏంటంటే.. ఏడు  మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో తెదేపాకు కేవలం 30శాతం మాత్రమే ఓట్లు వచ్చాయట. ఈ లెక్కలు కూడా వైకాపానే ప్రకటించిందట. అలాగే.. వైకాపా లెక్కల ప్రకారమే చూస్తే 7నెలలు తర్వాత జరిగిన ఎన్నికల్లో తెదేపాకు 48శాతం ఓట్లు వచ్చాయట.  అంటే.. అధికారపార్టీ పట్ల ప్రజా వ్యతిరేకం మున్సిపల్ ఎన్నికల్లో బయటపడినట్టే కదా.. అంటే వైసీపీ చిత్తుగా ఓడినట్టే కదా అంటున్నారు అచ్చెన్నాయుడు.


అంతే కాదు.. దొంగ ఓట్లతో కుప్పం గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు. కుప్పంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మొదటి రోజు నుంచి అంతా గమనించారని.. అక్కడ సామదాన దండోపాయాలు వైసీపీ నేతలు ప్రయోగించారని అచ్చెన్న అంటున్నారు. అంతే కాదు.. కుప్పంలో గెలుపు ఓ గెలుపా.. ఛీ.. మీ బతుకు చెడా అంటూ తిట్టిపోస్తున్నారు. మరో అడుగు ముందుకేసి.. వైకాపా విజయాన్ని డీజీపీకి అంకితం చేయాలని చెబుతున్నారు. డీజీపీ సహకారం కారణంగానే వైకాపా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందంటున్నారు అచ్చెన్నాయుడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ ప్రజా తీర్పుకు కూడా మరీ ఇలా వక్ర భాష్యం చెబితే ఎలా అచ్చెన్నాయుడూ.. అంటున్నారు ఆంధ్రా జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: