రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకం. కొన్ని వర్గాల ఓటు బ్యాంకును అంటి పెట్టుకొని ఉంటేనే పార్టీ బలంగా నిలబడుతుంది. ఉదా ఆంధ్రా లో కమ్మలు, కాపులు ఎటువైపు ఉంటే ఆపార్టీ విజయం సాధిస్తుంది. తెలంగాణలో కూడా కమ్మ, రెడ్డి సామాజిక వర్గం వారు ఒకటై కాంగ్రెస్ ను గెలిపించారు. ఇందుకు నిదర్శనం అన్ని పార్టీలో కలిపి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 43మంది ప్రజాప్రతినిధులుగా ఉండటం.


కమ్మ సామాజిక వర్గంలో కానీ.. రెడ్డి సామాజిక వర్గంలో కానీ ఉప కులాలు లేవు. అదే బీసీలో అయితే 139 కులాలు ఉన్నాయి. వీరందరనీ కలిపి బీసీలంతా మా వైపే అని రాజకీయ పార్టీలు ప్రకటించుకుంటూ ఉంటాయి. మళ్లీ వీరిలో కులాలను విభజించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను కొనసాగిస్తుంటారు. బీసీ అనే నినాదంతో అందర్నీ కలుపుకొని వెళ్లడం సాధ్యం కాదని ఉమ్మడి ఏపీ రాజకీయాలు నిరూపితం చేస్తున్నాయి.


మొట్ట మొదటి సారి సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు. దాదాపు 100మందికి బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించారు. దీంతో బీసీలకు ప్రజా రాజ్యం తోనే జరుగుతుందని బీసీలు భావించలేదు. ఆ పార్టీకి ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే వచ్చాయి.  మరోవైపు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీసీలు సుమారు 2 కోట్ల మంది ఉన్నారు. బీసీలకు సమన్యాయం టీడీపీతోనే సాధ్యం అని చెప్పి బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయినా కూడా ఆ పార్టీ బీజేపీ పొత్తుతో కలిపి 20 స్థానాలు సాధించింది. అప్పుడు కూడా బీసీ నినాదం పక్కకు వెళ్లింది.


ఈ సారి ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. విచిత్రం ఏమిటంటే అన్ని పార్టీల్లో కలిపి రెడ్లు  43 చోట్ల విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 13.9శాతం. వచ్చిన సీట్లు 8. వీటిని చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీ నినాదం పెద్దగా లాభించడం లేదు. బీసీలు సంఘటితం కావడం లేదు అనడానికి నిదర్శనం ఈ మూడు ఫలితాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bc