సాధారణంగా చాలామంది ప్రయాణాలను ఇష్టపడుతూ ఉంటారు. దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రయాణాల పేరు చెబితే చాలు భయంతో వణికి పోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ ప్రయాణం బస్సు కారు లో అయితే ఇక ప్రయాణం చేయాలనే ఆలోచనను కూడా విరమించుకుంటూ ఉంటారు. కారణం ప్రయాణాలు చేసే సమయంలో వాంతులు రావడమే ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణాలు చేసే సమయంలో వాంతులు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో ప్రయాణాలు అంటేనే భయపడిపోతుంటారు చాలామంది.



 అయితే ఇలా ప్రయాణాలు చేస్తున్న సమయంలో వాంతులు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా వాంతులు అవుతాయి అనే ఆలోచనను మైండ్ లో నుండి తీసేయాలట. అంతేకాదు ఏ వాహనంలో ప్రయాణించినప్పుడు వాంతులు వస్తాయని భావిస్తారో.. ఆ వాహనంలో ముందు సీట్లో కూర్చోవడం ఎంతో మంచిది. ఒకవేళ బస్సు అయితే మొదటి వరుసలో కూర్చోవాలి ఇలా కూర్చోవడం వల్ల బయట వాతావరణం మొత్తం చూస్తూ ఉంటారు. దీంతో వాంతుల పై దృష్టి ఉండదు. అదే సమయంలో ప్రయాణంలో ఇష్టమైన పాటలు వింటూ ఉండడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుందట. ఇక పక్క వారితో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండాలి.


 అంతేకాదు పుస్తకాలను చదవడం సోషల్ మీడియాలో నచ్చిన వీడియోలను చూడటం లాంటివి కూడా చేయాలట. ఒకవేళ ఇవన్నీ ట్రై చేసినా కూడా వాంతులు ఆగకుండా వస్తున్నట్లుగా అనిపిస్తే మాత్రం మరో రెండు చిట్కాలను ట్రై చేయవచ్చు అని అంటున్నారు. అయితే ఇది ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉన్న చిట్కాలే వాంతులు వస్తున్నాయి అనుకుంటున్న సమయంలో కాస్త అల్లం తీసుకోవడం వల్ల వాంతులు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందట. ఇక అందరికీ తెలిసినట్లుగానే నిమ్మకాయ వాసన చూడటం వల్ల కూడా వాంతులు అవకుండా ఉంటుందట.  ఏదేమైనా ఇవన్నీ చిట్కాలు పని చేయాలంటే మాత్రం ముందుగా వాంతులు వస్తాయని భావనను మైండ్ లో నుంచి తీసివేయాలి  అని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: