
ప్రస్తుతం ఈ ఐతే దాడులు బాలీవుడ్ చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాకుండా అన్నీ సినీ వర్గాల పరిశ్రమల్లో కూడా ఆందోళనలు రేపింది. అలాగే మరొక బాలీవుడ్ సినీ నిర్మాత వికాస్ బల్, ఫాంటమ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఐటి సోదాలకు ముందు తాప్సి, అనురాగ్ కశ్యప్ మన ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కొన్ని అప్పట్లో దుమారం లేపాయి. కొత్త వ్యవసాయ చట్టాలు విషయంలో కూడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్ మాట్లాడారు.అంతేకాకుండా ఇటీవల రిహానా పోస్ట్‌కు వ్యతిరేకంగా భారత సెలబ్రిటీలు మాట్లాడాన్ని కూడా వారు తప్పుబ్టటారు.
ఇప్పుడు వాళ్ళ మీద ఈ ఐటి సోదాలు జరగడం కొంచెం ఆలోచించదగ్గ విషయం అనే చెప్పాలి. ఇకపోతే తాప్సి మన టాలీవుడ్ లో పలు సూపర్ హాట్ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది . రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తాప్సీ మెల్లగా అన్నీ తమిళ, హిందీ పరిశ్రమల్లో కూడా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ప్రస్తుతం తాప్సీ పన్ను శభాష్ మిథు చిత్రంలో నటిస్తోంది. టీమిండియా మహిళా క్రికెటర్ 'మిథాలి రాజ్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటోంది. ఇందులో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. అందుకోసం క్రికెటర్‌గా మారిపోయింది.