
సెన్సార్ సమస్యలు మరియు డబ్బింగ్ ఆలస్యం కారణంగా గోల్డ్ సినిమా తమిళ విడుదల వాయిదా పడింది. రేపు సినిమా విడుదల కావచ్చు లేదా విడుదల కాకపోవచ్చు. కానీ ప్రస్తుతం మలయాళం లో ఒక్కటే రేపు అనగా 2022 డిసెంబర్ రెండవ తేదీన విడుదల కాబోతోంది. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళం డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాకు పృథ్వి రాజ్ ప్రొడక్షన్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా.. హీరోయిన్గా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార కీలకపాత్ర పోషిస్తుంది.
2015 ప్రేమమ్ సినిమా తర్వాత దాదాపు 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరి అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు వాయిదా పడడం అలాగే సెన్సార్ సమస్యల కారణంగా సినిమాలో వాయిదా వేస్తూ వచ్చారు. అయితే మలయాళం లో ఒక్కటే డిసెంబర్ రెండవ తేదీన సినిమాలో విడుదల చేయబోతున్నారు. తమిళ సినిమాలో విడుదల చేయవచ్చు..లేకపోవచ్చు సెన్సార్ సమస్యలన్నీ తొలగిన తర్వాతనే తమిళ్లో కూడా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికైతే కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశారు చిత్ర బృందం.