పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనిల్ కుమార్ ఆత్మహత్య చేసున్న వార్తలు పవన్ అభిమానుల మధ్య సంచలన వార్తగా మారడమే కాకుండా పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. విజయవాడలో జిమ్ ట్రైనర్ ఉద్యోగం నిర్వహిస్తున్న అనిల్ కుమార్ చనిపోవడానికి ముందు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. తనకు ‘జనసేనా’ ని చేతుల మీదుగా అంత్యక్రియలు జరగాలని ఆ లేఖలో కోరడం షాకింగ్ న్యూస్ గా మారింది.
ఇది తన చివరికోరిక అంటూ ఆ ఉత్తరంలో కోరడంతో ఇప్పుడు ఆకోరికను పవన్ నెరవేర్చ గలడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనిల్ కుమార్ పవన్ అత్యంత వీరాభిమాని అని తెలుస్తోంది. గత కొంతకాలంగా అతడు ‘జనసేన’ పార్టీ కోసం పనిచేస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు
అనిల్ గత కొద్దిరోజులుగా తీవ్ర డిప్రెషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈవీరాభిమాని తన లేఖలో తనకోసం పవన్ తప్పక వస్తాడని ఆయన వచ్చిన తరువాత మాత్రంమే తన అంత్యక్రియలు జరపాలని తన తల్లి తండ్రులను కోరినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవార్త మీడియా వర్గాలలో వైరల్ గా మారింది. తమ పై ఉన్న విపరీత మైన ప్రేమతో తమ అభిమానులు బలి పశువులుగా మారవద్దని ఎన్నోసార్లు టాప్ హీరోలు బహిరంగంగా చెప్పినా చెప్పినా ఇలాంటి దురష్టకర సంఘటనలు జగురుతూనే ఉన్నాయి.
తన అభిమానులకు కష్టం కలిగితే తాను చూడలేను అని అనేక సార్లు ఓపెన్ గానే చెప్పిన పవన్ ఈవిషాదకర సంఘటన పై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఏదిఏమైనా టాప్ హీరోలపట్ల వారి వీరాభిమానులకు ఉండే విపరీతమైన మ్యానియాను ఈదురదృష్టకరమైన సంఘటన మరోసారి రుజువు చేస్తోంది..