దర్శకుడు గా రాజమౌళి జాతీయస్థాయి ఖ్యాతిని అందుకున్నప్పటికీ అతడి కొడుకు కార్తికేయ ను మాత్రం ఒక ప్రముఖ నిర్మాతగా మార్చాలని రాజమౌళి ఎంతో ఆశ పడుతున్నాడు. వాస్తవానికి కార్తికేయ రాజమౌళి బిజీగా ఉన్నప్పుడు ‘బాహుబలి’ లోని కొన్ని సన్నివేశాలు డైరెక్ట్ చేసిన అనుభవం కూడ ఉంది. సీన్స్ ను డైరెక్ట్ చేయడంలో కార్తికేయ కు మంచి అనుభవం ఉందని స్వయంగా రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.


అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో దర్శకుడుగా రాణించడం కష్టం అన్న అభిప్రాయంతో కార్తికేయ ను నిర్మాతగా మార్చాలని రాజమౌళి చేసిన మొదటి ప్రయత్నం సగంలోనే బెడిసికొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అందరు కొత్త నటీనటులతో ‘ఆకాశవాణి’ అన్న టైటిల్ తో ఒక సంవత్సరం  క్రితం అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈమూవీ ప్రారంభం అయింది.


విశాఖపట్నం జిల్లాలోని పాడేరు చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మూవీ తొలి షెడ్యూల్ 40 రోజులు నిర్వహించారు. ఈ మూవీ తొలి షెడ్యూల్ కు సంబంధించి షూట్ చేసిన సన్నివేశాలను రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ బిజీలో కూడ చూడటమే కాకుండా అనేక సలహాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఒక రాజమౌళి మార్క్ చిన్న సినిమాను చూడబోతున్నాము అన్న సంకేతాలు వచ్చాయి. 


అయితే గత కొద్ది నెలలుగా ఈ సినిమా గురించి ఎటువంటి వార్తలు బయటకు రాలేదు. దీనితో ఈ మూవీకి ఏమైంది అంటూ అనేక గాసిప్పులు కూడ వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ కార్తికేయ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని క్రియేటివ్ విభేదాల కారణంగా తాను ఆకాశవాణి మూవీ ప్రాజకేట్ నుండి తప్పుకుంటున్నట్లు మీడియాకు ప్రకటన ఇచ్చి ఈ మూవీ విజయవంతం కావాలని ఆకాంక్షించాడు. దీనితో ఈ మూవీ ఆగిపోయింది అన్న క్లారిటీ వచ్చినా అపజయం అన్నపదం ఎరుగని రాజమౌళి కొడుకు మొదటి ప్రయత్నమే మధ్యలో ఆగిపోవడం ఒక విధంగా రాజమౌళికి షాక్ అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: