తెలుగు సినిమాకు దొరికిన కొత్త అందం నివేధా పేతురాజ్. మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగులో పరిచయమైంది ఈ హీరోయిన్. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రలహరి, బ్రోచేవారెవరు మూవీస్ లో మంచి పాత్ర చేసి గుర్తింపు తెచ్చుకుంది., అల్లు అర్జున్ సినిమా అల.. వైకుంఠపురములో సినిమాతో కాస్త లైమ్ లైట్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండే నివేధా రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలో చాలా గమ్మత్తైన స్టిల్ ఇచ్చి నెటిజన్లను, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

 

 

ఈ పిక్ లో ఫుల్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న నివేదా చాలా నాచురల్ స్టిల్ ఇచ్చింది. కుర్చీలో వాలుగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టున్న నివేదా చాలా రొటీన్ స్టిల్స్ కు భిన్నంగా ఉంది. పైగా వింటేజ్ స్టైల్లో డిజైన్ చేసి మరీ పోస్ట్ చేయడం ఆకట్టుకుంటోంది. DRAMA అనే కొటేషన్ ఇచ్చి.. మేగజైన్ ఇన్ స్పైర్డ్ అని తన వాల్ లో రాసుకుంది. సినిమాల్లో కూడా చాలా అందంగా కనిపించే నివేదా ఫోటోషూట్స్ లో కూడా అంతే అందంగా ఉంటోంది. దీంతో అమ్మడి స్టిల్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘బ్లాక్ అండ్ వైట్ లోనే ఇలా ఉంట కలర్ లో ఇంకెంత అందమో’, ‘నాచురల్ బ్యూటీ’ అంటూ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు.

 

 

పనిలో పనిగా తన పేరు మీద అనేక ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని.. ఫ్యాన్స్ ఎవరూ దానికి రిప్లై ఇవ్వొద్దంటూ మరో వీడియో కూడా పోస్ట్ చేసింది. అఫిషియల్ బ్లూ టిక్ కోసం ట్విట్టర్ యాజమాన్యానికి అప్లై చేశానని కూడా చెప్పుకొచ్చింది. నెటిజన్లు కూడా నివేదాను ఇదే అడుగుతున్నారు. అఫిషియల్ ఐడీ ఇవ్వండి మేడమ్ అంటూ నివేదాకు మెసేజెస్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: