నాని  లేటెస్ట్ మూవీ ‘టక్‍ జగదీష్‍’  వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‍ లో రిలీజ్‍  అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ‘వి’ ఫలితంతో అలర్ట్ అయిన నానిమూవీ కధలో కూడ కొన్ని మార్పులు చేయడంతో ఈ మూవీ షూటింగ్ చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు లీకులు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ గురించి అప్ డేట్స్ ఏవి అఫీషియల్‍ గా  రావడంలేదు.


మూవీ తర్వాత ‘శ్యామ్‍ సింగ రాయ్‍’ చిత్రం చేయాలని నాని  ఫిక్స్  అయినప్పటికీ బడ్జెట్‍ ఎక్కువ అవుతుంది అన్న అభిప్రాయంతో నిర్మాత తప్పుకున్నా మరో నిర్మాతను తీసుకొచ్చి నాని ఈ ప్రాజెక్ట్ అప్పగించాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీ  ఎప్పుడుప్రారంభం అవుతుంది అన్న విషయమై నానీకి స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థుతుల మధ్య నాని ‘అంటే సుందరానికీ’ అనే సినిమా అనౌన్స్ చేసిన సందర్భంలో చేసిన హంగామా వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వివేక్‍ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే ఈ అడల్ట్  కామెడీ సినిమా ఇప్పట్లో మొదలుకాదు అని తెలుస్తోంది. దీనితో ఎప్పుడో మొదలయ్యే సినిమాకు నాని ముందుగా ఇంత హడావిడి ఎందుకు చేసాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చచర్య పోతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘శ్యామ్‍ సింగరాయ్‍’ బడ్జెట్‍ దృష్టిలో ఉంచుకుని నాని ఆ చిత్రాన్ని కాస్త వెనక్కు జరిపి ముందుగా ఈ సుందరం మూవీ చేయాలని భావిస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం నాని మార్కెట్ అంత ఆశా జనకంగా లేని పరిస్థుతులలో ముందుగా మీడియం బడ్జెట్ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత తన మార్కెట్ మళ్ళీ మెరుగు పడ్డాక ‘శ్యామ్‍ సింగ రాయ్‍’ ను మొదలు పెట్టాలని నాని వ్యూహం అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ లో  ప్రస్తుతం ట్రెండ్  అవుతున్న అడల్ట్ కామెడీ మూవీలను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: