కాజల్ అగర్వాల్ సినీ ప్రపంచంలో అడుగుపెట్టి 15 సంవత్సరాలకు పైగా గడుస్తోంది. కానీ ఇప్పటికీ ఆమెకున్న క్రేజ్ అణువంతైనా తగ్గలేదు. వివాహానంతరం కూడా కోలీవుడ్ లో 4 సినిమాలతో పాటు ఆమె టాలీవుడ్ లో 2 సినిమాలతో కాజల్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన నటిస్తున్న ఆమె డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న మరొక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే పెళ్లయిన తర్వాత సమంత అక్కినేని కేవలం ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం ప్రారంభించారు. పాత్ర ప్రాధాన్యత కలిగిన సినిమాలలో సమంత నటిస్తూ ఒక గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గ్లామర్ రోల్ కి దూరంగా ఉంటున్నారు.




అయితే కాజల్ కూడా ఆమె బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె కూడా కేవలం పాత్ర ప్రాధాన్యత కలిగిన సినిమాల్లోనే చేస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగాత్మక చిత్రం మోసగాళ్ళు ఆమె పెళ్లి తర్వాతనే విడుదలయింది. గౌతమ్ ని వివాహం చేసుకున్న అనంతరమే కాజల్ లైవ్ టెలికాస్ట్ అనే ఒక హారర్ కామెడీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పెళ్లయిన తర్వాత ఆమె చేసిన ఈ రెండు ప్రయోగాత్మక ప్రాజెక్ట్స్ సక్సెస్ సాధించలేకపోయాయి. కానీ కాజల్ మాత్రం వెనకడుగు వేయకుండా ఎక్స్పరిమెంటల్ రోల్స్ చేయడానికి ముందడుగు వేస్తున్నారు.



తమిళంలో తెరకెక్కుతున్న ఘోస్ట్లి అనే ఒక హారర్ కామెడీ చిత్రంలో ఆమె పోలీస్ పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పటి వరకు పోలీస్ పాత్రలో నటించలేదు. కానీ పెళ్లయిన తర్వాత ఆమె ప్రయోగాత్మక చిత్రాలకు వెంటనే ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో హారర్ కామెడీ డ్రామాగా రూపొందుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో స్టంట్స్ చేయడానికి కాజల్ అగర్వాల్ కఠోరమైన శిక్షణ పొందుతూ చాలా కృషి చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా పెళ్లయిన తర్వాత కాజల్ తన రోల్స్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: