విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. దృశ్యం సినిమా సూపర్ హిట్ అవడంతో దృశ్యం 2 సినిమాపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఆ అంచ‌నాల‌ను ఈ సినిమా నూటికి నూరు శాతం నిలబెట్టుకుంది. దృశ్యం  సినిమా లో తన కుటుంబాన్ని కాపాడుకోవాలని రాంబాబు ఎంతో వేద‌న అనుభ‌వించాడు... అన్న‌ది నిజం అని ప్రేక్షకులు భావించారు. అత‌డి వైపు న్యాయం ఉందని అనుకున్నారు. అలాగే త‌మ కుమారుడి హ‌త్య కు కారణం తెలుసుకోవాలని అతడి తల్లిదండ్రులు కూడా కోరుకున్నారు. సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుల్లో  చాలా మందిలో అటువైపు కూడా న్యాయం ఉందని అనిపించింది. దృశ్యం సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఈ బలమైన ఎమోషనల్ థ్రెడ్‌. ఇప్పుడు కూడా దృశ్యం 2 సినిమాకు అదే ప్రాణం పోసింది. అదే సమయంలో పోలీసులు కంటే రాంబాబు ఇప్పుడు ఒక అడుగు ముందే ఆలోచించడం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

చివ‌ర‌కు వెంకీ క్యారెక్ట‌ర్ ను ఎంత ప్రామిసీంగా తెర‌కెక్కించారు అంటే కేవ‌లం దృశ్యం 2 మాత్ర‌మే కాదు… 4, 5, 6… ఇలా ఎన్నొచ్చినా, రాంబాబు త‌న కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎన్ని ఎత్తులు , పోలీసుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూనే ఉంటాడురా అన్నంత న‌మ్మ‌కాన్ని ద‌ర్శ‌కుడు బ‌లంగా క‌లిగించాడు. ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చాక రేప‌టి రోజున దృశ్యం 3 సినిమా వ‌చ్చినా కూడా క్లైమాక్స్ మాత్రం ఎలా ఉంటుందో ?  ప్రేక్ష‌కుడు ముందే ఊహించు కోగ‌ల‌డు.

ఇక వెంకీ చాలా నేచుర‌ల్ గా చేసిన న‌ట‌న కూడా సినిమా కు ప్రాణం పోసింది. అయితే ఈ న‌ట‌న‌ను మ‌ళ‌యాళంలో చేసిన మోహ‌న్ లాల్ న‌ట‌న‌తో అయితే స‌రి పోల్చి చూడ‌లేం. ఇక మీనా కూడా ఎప్ప‌టి లాగ‌నే ప‌ద్ధ‌తి అయిన పాత్ర‌లో క‌నింపించింది. తొలి భాగం తో పోలిస్తే.. ఈ పార్ట్ 2 లో పిల్ల‌ల భాగ‌స్వామ్యం చాలా త‌క్కువ నే చెప్పాలి. ఇక క్యారెక్ట‌ర్ల ను బేస్ చేసుకుని రాసుకున్న సినిమా కాదు. క‌థే పాత్ర‌ల‌ను న‌డిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: