
అయితే కొత్త హీరోయిన్ల రాకతో నివేదా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అవకాశాలు కూడా చాలా లిమిటెడ్‌గా వస్తుండటంతో.. వాటినే సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. గత ఏడాది `35 చిన్న కథ కాదు` మూవీతో నివేదా ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా అద్భుతంగా ఒదిగిపోయింది. తన పాత్ర కోసం కొంత బరువు కూడా పెరిగింది. కానీ ఆ తర్వాత పెరిగిన బరువును మాత్రం తగ్గించుకోలేకపోయింది.
35 మూవీకి గానూ ఉత్తమ నటిగా నివేదా థామస్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ హైటెక్స్ లో ఈ అవార్డు ఫంక్షన్ జరగగా.. నివేదా చీరకట్టులో సందడి చేసింది. అయితే ఆమె పర్సనాలిటీ చూసి అభిమానులతో సహా చాలా మంది షాకైపోయారు. ఎందుకంటే నివేదా శారీలో క్యూట్‌గా ఉన్నప్పటికీ.. బాగా లావుగా కనిపించింది. ఒకప్పటి నివేదా థామస్ కు ఇప్పుటి నివేదా థామస్‌కు అస్సలు పొంతనే కుదరడం లేదు. 35 సినిమా కోసమే నివేదా వెయిట్ గెయిన్ అయిందని కొందరు అంటుంటే.. నిజం అది కాదు, నివేదా థామస్ కి థైరాయిడ్ జబ్బు ఉందని, అందుకే ఆమె అంత బరువు పెరిగిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.