సినిమా ఇండస్ట్రీ లో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో రూపొందించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక హీరోతో అనుకున్న సినిమాను మరొక హీరోతో రూపొందించిన సందర్భంలో ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించినట్లయితే ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని ఆ హీరో అనుకోవడం , అలాగే ఆయన అభిమానులు కూడా అనుకోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ తన కెరీర్లో వదిలేసుకున్న ఓ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే అందుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏది ..? ఆయన ఎందుకు ఆ మూవీ ని వదిలేసుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ "పోకిరి" అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుని అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథలో మొదటగా పూరి జగన్నాథ్ , మహేష్ బాబును హీరోగా అనుకోలేదట. ఈ మూవీ కథను రవితేజ హీరోగా రూపొందించాలి అనుకున్నాడట. అందులో భాగంగా కథను కూడా తయారు చేశాడట. కథ మొత్తం రెడీ అయ్యాక రవితేజకు దానిని వినిపించగా రవితేజ కూడా ఆ స్టోరీ తో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించిన ఓకే అన్నాడట. సినిమా స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు రవితేజ "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్" మూవీ ని చూశాడట. ఆ మూవీ బాగా నచ్చడంతో ఆ మూవీ తెలుగు రీమిక్ లో నటించాలి అని రవితేజ భావించాడట. దానితో పూరి జగన్నాథ్ , పోకిరి సినిమా కథను ఆ సమయంలో పక్కన పెట్టి ఆ తర్వాత మహేష్ బాబుతో పోకిరి అనే టైటిల్ తో రూపొందించాడట. ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. అలా రవితేజ ఏకంగా ఇండస్ట్రీ హిట్ను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: