బిగ్ బాస్-2లో ఈసారి కామన్ మెన్ కు అవకాశం ఇవ్వడం అనేది మంచి విషయమే. అయితే హౌజ్ లో కామన్ మెన్ గా వచ్చిన వారు కూడా సామాన్యులేం కాదు సంజనా మోడల్ కాగా.. గణేష్ ఆర్జేగా పనిచేస్తున్నాడు. ఇక నూతన్ నాయుడు పొలిటికల్ లీడర్ గా చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు.


మొదటివారం సంజనా ఎలిమినేట్ అవగా రెండో వారం నూతన్ నాయుడు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చాడు. కౌశల్, నూతన్ నాయుడుల మధ్య చివరి దాకా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఫైనల్ గా నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. అయితే నూతన్ నాయుడు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో ఆయన గురించి కాస్త ఎక్కువగానే చెప్పారు.  


కాని బయటకు వచ్చాక నాని, నూతన్ నాయుడిని మొత్తం చూసేశామా అని అడిగాడు.. అందుకు ఆయన సమాధానంగా పరిపూర్ణంగా చూశారు.. సంపూర్ణంగా చూడలేదని ఆయన అన్నారు. ఇక ఈ ఆదివారం షో నాని సీరియస్ గా హౌజ్ లో ఉన్న సభ్యులందరికి క్లాస్ పీకాడు. 


ఇన్ని కోట్ల జనాల నుండి మీ 16 మంది మాత్రమే ఈ హౌజ్ లో ఉంటున్నారు అంటే మీరు చాలా స్పెషల్ అని.. మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయని. ఇక హౌజ్ లో ఉన్న అందరి క్యారక్టర్స్ ను ప్రేక్షకులు అంచనా వేస్తున్నారని అన్నాడు నాని. కౌశల్ కు స్పెషల్ గా క్లాస్ పీకిన నాని ఆదివారం షో మొదట ఫన్ ఎలిమెంట్స్ తో మొదలైనా కాస్త హాట్ హాట్ గానే సాగిందని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: