
అందుకేనేమో ఇటీవల సీఎం కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు.. అంతకుముందు ఏపీలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మి ప్రకాశం జిల్లా వంటి చోట్ల నాలుగు ఎకరాలు కొంటున్నారు అని సాక్షాత్తూ కేసీఆరే చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమంటున్నాయి సర్కారు ఆదాయం నివేదికలు. అవును తెలంగాణలో భూములు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాలు బాగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ సాగు భూముల క్రయ, విక్రయాలు జోరుగా ఉన్నాయి. అటు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇలా అన్ని రకాల భూములకు గిరాకీ పెరగడంతో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరిగింది.
తెలంగాణలో భూముల విలువ పెరగడం, సాగు భూములకు డిమాండ్ బాగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్లు బాగా పెరిగాయి. తెలంగాణలోని 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. జరుగుతున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని రిజిస్ట్రేషన్లలో 50 శాతం వరకూ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ కంటే ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడిని సర్కార్ అంచనా వేయగా.. కరోనా వంటి పరిస్థితులు ఉన్నా.. ఇప్పుడు అందుకునేలా ఉంది రిజిస్ట్రేషన్ల రాబడి.