స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పల్నాడు ప్రాంతం మాచర్లలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అయినా బోండా ఉమా మరియు బుద్ధా వెంకన్న పై దాడి జరగడం ఏపీ రాజకీయాల్లో హైలెట్ వార్తగా నిలిచింది. కావాలని వైసిపి పార్టీకి చెందిన నాయకులు స్కెచ్ వేసి మరి మా పై దాడి చేశారని అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు అని బోండా ఉమా, బుద్దా వెంకన్న జరిగిన దాడి ఘటన ఉద్దేశించి షాకింగ్ కామెంట్ చేశారు. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కారు ఏవిధంగా ధ్వంసం అయిందో అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రౌడి పరిపాలిస్తున్నాడు అని అన్నట్లుగా మాట్లాడారు.

 

పోలీసులు వైసిపి పార్టీ వాళ్లకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఇదే తరుణంలో ఆ కారులో వారితో పాటు న్యాయవాది కూడా ప్రయాణించడం తో ఆయన తల పగలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. మరోపక్క వైసిపి పార్టీ నాయకుడు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాచర్లలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి కారుతో ఒక యువకుడిని యాక్సిడెంట్ చేసి ప్రజలపై దురుసుగా ప్రవర్తించారు అందువల్లనే వాళ్లని అనగా బోండా ఉమ, బుద్ధ వెంకన్న నీ జనాలు కొట్టడం జరిగిందని ఆ గొడవ కి వైసీపీ కి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

 

అయితే ఈ దాడి ఘటన కేంద్రం దృష్టికి వెళ్లడంతో అధికార పార్టీపై విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ పరిపాలన విధించడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన మరియు బిజెపి పార్టీకి సంబంధించిన నేతలపై ఎటువంటి దాడి జరగకపోవడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొద్దిగా  గవర్నర్ పరిపాలన విషయంలో కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: