గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో ఎన్నో అంచ‌నాల‌తో పోటీ చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. చంద్ర‌బాబు త‌న‌యుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌. వైసీపీ దెబ్బ‌తో ప‌వ‌న్ గాజువాక‌తో పాటు ఆయ‌న సొంత జిల్లా అయిన భీమ‌వ‌రంలోనూ ఓడిపోయారు. గాజువాక‌లో ఏకంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఇక నారా లోకేష్ మంత్రిగా ఉండి... సీఎం త‌న‌యుడిగా ఉండి మంగ‌ళ‌గిరిలో ఓడిపోయి ప‌రువు పోగొట్టుకున్నారు. ఇక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత మంగ‌ళ‌గిరిలో లోకేష్ అడ‌పా ద‌డ‌పా కొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఇంకా చెప్పాలంటే లోకేష్‌కు మంగ‌ళ‌గిరి ఇష్టం లేక‌పోయినా త‌ప్ప‌క అక్క‌డ మొక్కుబ‌డిగా ప‌ని చేస్తున్నారు.



ఇక ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే గాజువాక‌లో ఓట‌మి త‌ర్వాత గాజువాక అంటేనే పవన్ కి చిర్రెత్తుకువచ్చేదని అంటారు.  ఎన్నికల్లో గెలిచినా ఓడినా గాజువాకలోనే ఉంటానంటూ అప్పట్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మరీ హంగామా చేసిన పవన్ ఓడాక గాజువాక మొఖం చూడ‌డం లేదు. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వీరిద్ద‌రు గ‌త ఎన్నిక‌ల్లో తాము పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌క్క‌న పెట్టేసి కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు వెతుక్కునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ప‌వ‌న్ గాజువాక‌, త‌న సొంత జిల్లా వ‌దిలేసి... త‌న అన్న గ‌తంలో గెలిచిన చిత్తూరు జిల్లాలోని తిరుప‌తి వైపు కాన్‌సంట్రేష‌న్ చేయ‌నున్నార‌ట‌. అక్క‌డ కాపుల ఓట్లు ఎక్కువుగా ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ అటు మొగ్గు చూపుతున్నాడ‌ట‌.



ఇక లోకేష్‌కు తాను మంగ‌ళ‌గిరిలో ఎప్ప‌ట‌కీ గెల‌వ‌న‌నే త‌న తండ్రికి కంచుకోట అయిన కుప్పం నుంచి పోటీ చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. అవ‌స‌ర‌మైతే బాల‌య్య‌ను త‌ప్పించి చంద్ర‌బాబు హిందూపురంకు వెళ్ల‌డ‌మో ?  లేదా ? ఆయ‌న మ‌రో నియోజ‌క‌వ‌ర్గం చూసుకోవ‌డ‌మో చేస్తారు. కుప్పం అయితే త‌న‌కు సేఫ్ అని లోకేష్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి ఈ ఇద్ద‌రు యువ నాయ‌కులు జ‌గ‌న్ దెబ్బ‌తో త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు వ‌దులుకుని ఇప్పుడు ఇద్ద‌రు చిత్తూరు జిల్లాకు పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: