జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు ఏదొరకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ బాబు వేసే ప్రతి ప్లాన్ దాదాపు ఫెయిల్ అవుతూనే ఉంది. తాజాగా కూడా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై రాజకీయం చేయాలని చూశారు. కోటి సాయం వల్ల మనిషి ప్రాణాలు తిరిగి రావన్నట్లు మాట్లాడి, బాధితులని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అని ఏర్పాటు చేసి గ్యాస్ లీకేజ్ ఘటనని రాజకీయం చేయాలని చూశారు. అలాగే స్థానిక టీడీపీ నేతలని గ్యాస్ లీకేజ్ ప్రాంతానికి పంపి హడావిడి చేయాలని చూశారు. కానీ వారి ప్లాన్‌ని ముందే పసిగట్టిన పోలీసులు అడ్డుకుని వారిని అక్కడ నుంచి పంపించేశారు.
ఇక తర్వాత మడ అడవులు నరికి ఇళ్ల స్థలాలకు కింద ఇస్తున్నారని బాబు బ్యాచ్ హడావిడి చేయడం మొదలుపెట్టింది. 

 

పేదలకు ఇళ్ల పట్టాలకు ఇచ్చేందుకు సిద్ధమైన భూములని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్థారణ కమిటీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని దుమ్ములపేట వెళ్లింది. మొదట టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తమ వాహనాలను వదిలేసి టీడీపీ నేతలు కాలినడకన బయలుదేరారు. కేవలం మాకు ప్ర‌చారం వ‌స్తుంద‌న్న కోణంలోనే టీడీపీ వాళ్లు ఇంత హ‌డావిడి చేస్తున్నారే త‌ప్పా అక్క‌డ పేద‌ల‌కు ఎంత ల‌బ్ధి క‌లుగుతోంది అన్న‌ది మాత్రం వాళ్ల‌కు అన‌వ‌స‌రం. ప్ర‌తి విష‌యాన్ని ఏదోలా రాజ‌కీయం చేయ‌డ‌మే టీడీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది.

 

అయితే భూములు ఉన్న ప్రాంతంలో లబ్దిదారులు టీడీపీ బృందానికి షాక్ ఇచ్చారు. నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, గోరంట్ల, జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు లతో కూడిన కమిటీని లబ్ధిదారులు నిలువరించారు. ఈ విధంగా బాబు వేస్తున్న ప్రతి ప్లాన్ ఆదిలోనే ఫెయిల్ అయిపోతున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఎప్ప‌ట‌కి నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్ష నేత‌గా మార‌తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: