జగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, అప్పుడు అవకాశం దక్కని వారికి రెండున్నర ఏళ్లలో జరగబోయే విస్తరణలో అవకాశం కల్పిస్తానని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంది అంటే మరో 13 నెలల్లో జగన్ మంత్రి వర్గ విస్తరణ చేయడం ఖాయం.

ఇందులో అవకాశం కొట్టేయాలని పలువురు సీనియర్ నేతలు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కో మంత్రి మాత్రమే ఉన్నారు. అంటే ఈ జిల్లాలకు మరో కేబినెట్ బెర్త్ దక్కడం ఖాయం. ఇక ఇందులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న విశాఖపట్నంకు మరో మంత్రి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి లేదా రెండు మంత్రి పదవులు రావోచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతానికి విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్ మంత్రివర్గంలో ఉన్నారు. ఇక ఇక్కడ మరో బెర్త్ కోసం యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచిన అమర్ దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్లు ఇవ్వడంలో ముందున్నారు. అటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సైతం మంత్రి రేసులో ఉన్నారని తెలుస్తోంది. తనదైన మాట శైలి, యాస, ప్రాసలతో మెప్పించే ధర్మశ్రీకి ఓ అవకాశం ఇచ్చి చూడొచ్చు.

ఇక సీనియర్ నేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావులకు జగన్ కేబినెట్‌లో అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. అయితే వీరిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చెప్పలేం. ఆయన యువ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కరలేదు. కాబట్టి విశాఖలో మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరో చూడాలి. అదే సమయంలో టీడీపీకి చెక్ పెట్టగలిగే నేతలకే సీఎం జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: