ఆంధ్రప్రదేశ్  లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు ఎలాంటి ముందు అడుగు పడుతుంది ఏంటీ అనే దాని మీద అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఎన్నికల కమీషన్ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర విమర్శలు చేసారు. కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా  మాట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అన్నారు.

సాధారణ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల చాలా దారుణం గా  జరిగాయన్న ఆయన... మొన్న జరిగినవి చూసామని  పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గరి నుంచి దౌర్జన్యానికి దిగారన్నారు. చాలా స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు అధికార పార్టీ పార్టీ నేతలు అని ఆయన ఆరోపణలు చేసారు. ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సభ్యసమాజం సిగ్గుపడేలా ఎన్నికల కమిషనర్ ను కులం పేరుతో దూషించారు అన్నారు.

కరోన క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారన్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులలమధ్య తగాదాలు, సంక్షేమము లేదు అని విమర్శలు చేసారు. ఈ టైం లో ఎన్నికలు పెడితే దెబ్బతింటామని వైసీపీ భావిస్తోంది అని, రెండు చెంపలు వాయించడానికి  ప్రజలు సిద్దంగా ఉన్నారు అని ఆయన అన్నారు. నామినేషన్ ఆన్లైన్ లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరామని ఆయన వివరించారు. ఎన్నికల సందర్భం గా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలని కోరామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నాం అని ఆయన వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: