తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు దశాబ్దాలుగా గేమ్ సాధిస్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబుకు సొంత నియోజకవర్గమైన కుప్పం లో ఉహించని పరిణామం ఎదురైంది. కార్యకర్తలు  చేసిన నినాదాలతో చంద్రబాబు మౌనంగా ఉండిపోవాల్సివచ్చింది. కుప్పంలో చంద్రబాబు పేరు తప్ప మరో నేత వేరే వినపడదు. కానీ ఇప్పుడు కుప్పం సాక్షిగా పార్టీ బలోపేతం పై కార్యకర్తలు మనసులో మాట చెప్పేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శాంతిపురం మండలంలో రోడ్ షో నిర్వహించారు.


 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అక్కడ ఉన్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. శాంతిపురం రోడ్ షో లో చంద్రబాబును సార్ అంటూ పిలిచి మరీ జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకురావాలని అక్కడి కార్యకర్తలు కోరారు. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తీసుకురండి సార్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలు విన్న చంద్రబాబు మౌనంగా తెలుపుతూ ఉండిపోయారు. ఎన్టీఆర్ వస్తారని గాని రారు అని గాని చెప్పలేదు. దీంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంత ఉందో కార్యకర్తలు చంద్రబాబుకు  చెప్పకనే చెప్పారు.


 రాష్ట్రంలో టిడిపి బలపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కటే మార్గమని కార్యకర్తలతో పాటు నేతలు కూడా భావిస్తున్నారు. గతంలో పలు చోట్ల ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా కార్యకర్తలు కుప్పంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా ఎన్టీఆర్ ఫోటోలు దర్శనమిచ్చాయి. గతంలో చంద్రబాబు కుప్పం వెళ్ళినప్పుడల్లా కేవలం చంద్రబాబు లోకేష్ ఫోటోలతో మాత్రమే ఫ్లెక్సీలు  ఉండేవి కానీ ఈసారి అందుకు భిన్నంగా ఎన్టీఆర్,బాలకృష్ణ , కూడా కనిపించాయి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత బలమైన నాయకుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు.



 అయితే యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం పై ప్రశ్నించిన ప్రతిసారి ఎన్టీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ తమదేనని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏముంది అని కామెంట్ చేశారు. 2009 ఎన్నికల సమయంలో మాత్రం టీడీపీ కి మద్దతుగా ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట పార్టీకి ఓటమి ఎదురైంది.  ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వారు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. తన కుమారుడు లోకేష్ కోసమే చంద్రబాబు ఎన్టిఆర్ ని పక్కన పెట్టాలని వంశీ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: