ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అధికార వైసీపీలో రెబెల్స్ మోగిస్తున్నారు. క‌డ‌ప జిల్లాలో ఒక‌టి అయిన బ‌ద్వేల్ మున్సిపాల్టీలో 35 వార్డుల‌కు వైసీపీ నుంచే ఏకంగా 90 మంది నామినేష‌న్లు వేశారు. వీరిలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి 35 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. మ‌రి కొంద‌రు బీ ఫామ్‌లు ఇవ్వ‌క‌పోయినా స్వ‌తంత్య్రులుగా బ‌రిలో ఉంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో  రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు.

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని మున్సిపాల్టీ కావ‌డంతో ఈ ఎన్నిక‌ల‌ను జిల్లా వైసీపీ కీల‌క నేత‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక ఎమ్మెల్సీ గోవింద‌రెడ్డికి ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కం కానున్నాయి. ఆయ‌న రెబల్స్ ను బుజ్జ‌గించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఎవ్వరూ పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నట్లు వైసీపీలో చర్చ సాగుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటున్నా ధిక్కరణ ధోరణిలోనే ఉన్నట్లు సమాచారం.

అయితే రెబ‌ల్స్ వాద‌న మ‌రోలా ఉంది. పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన వారికి కాకుండా కొత్త‌గా పార్టీలో చేరిన వారికి చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని.. అలాంటప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డిన వారి సంగ‌తేంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. రెబ‌ల్స్ నామినేష‌న్లు తీసేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇక్కడ వైసీపీకి గెలుపు కష్టంగా మారింది. ఇప్ప‌టికే జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పులివెందుల‌లో అన్ని వార్డులు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి.

రేపు బ‌ద్వేల్ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే స్థానిక నేత‌లు జ‌గ‌న్ ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దు. మ‌రీ బ‌ద్వేల్లో ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య రెబ‌ల్స్ ను ఎలా దారి లోకి తెచ్చుకుంటారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: