
2023 ఐపీఎల్ సీజన్లో ఇదే విధంగా హవా నడిపించింది అన్న విషయం తెలిసిందే. సీజన్ ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఇక గుజరాత్ టైటన్స్ పై ఫైనల్ లో విజయం సాధించి ఇక సత్తా చాటింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ క్రమంలోనే ఐపిఎల్ హిస్టరీలో ఐదవ సారి టైటిల్ సాధించి ఎన్నో రికార్డులు సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇలా ఒక జట్టు టైటిల్ విన్నర్ గా నిలిచినప్పుడు ఆ జట్టులో మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్లుగా ఉన్న వారి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అంత రివర్స్ జరుగుతుంది.
ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించిన జడేజా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం కామన్. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మిచెల్ సాంట్నర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అతను జట్టు తరఫున కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. టీం కాంబినేషన్ బాగుండడంతో అతనికి ఛాన్స్ రాలేదు. అయినప్పటికీ అతను చెన్నై అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. శాంట్నర్ డీసెంట్ ప్లేయర్ అని.. జీరో యాటిట్యూడ్ 100% కమిట్మెంట్ ఉన్న ప్లేయర్ అంటూ ఎంతో మంది చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ అతని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.