
ఇంకా చెప్పాలంటే హైలెట్ చేసి చూపిస్తుందట. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ వాళ్ళకి ఉంది అన్నట్లుగా తయారయింది పరిస్థితి. ప్రత్యేకించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రంలో ముఖ్యమైన పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరికీ వాళ్లకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే స్వయంగా సాక్షి పేపర్, అలాగే సాక్షి న్యూస్ ఛానల్ ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనను సపోర్ట్ చేయడానికి ఓ ప్రధాన పత్రిక యజమాని తన పేపర్, అలాగే న్యూస్ ఛానల్ తో రెడీగా ఉంటాడు ఇప్పటికీ కూడా. అలాగే ఆయన మాత్రమే కాకుండా ఇంకా మరికొన్ని ఛానళ్లు, ఓ పత్రిక కూడా చంద్రబాబుకి సపోర్టు చేస్తూ ఉంటాయి. ఆయన న్యూస్ నే హైలెట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఛానెల్స్ కి సంబంధించి వాళ్లు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం, ఆయన వార్తలను హైలెట్ చేయడం అనేది వాళ్ళ సొంత విషయం.
వాళ్లు ఆయనను అభిమానిస్తారు కాబట్టి అది వాళ్ళ మీడియా చానల్స్ యొక్క సొంత విషయం. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి వాళ్ళ భజన ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్లిపోయిందని అంటున్నారు. జైల్లో చంద్రబాబు నాయుడు వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారని, ఆయన్ని చూడ్డానికి జనాలు బారులు తీరిపోతున్నారని చెప్పుకొస్తున్నారు. వాళ్ల ఎక్స్ట్రీమ్ భజనకు విరక్తి చెందే జనం పరామర్శించడానికి రావడం లేదని తెలుస్తుంది.