తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్న పాతబస్తీ పండుగ శోభలను అద్దుకుంది. మిలాద్ ఉన్ నబీకి అక్కడి వారు వారి ప్రాంతాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. ఎక్కడ చూసినా, పాతబస్తీలో ప్రధాన రహదారులు, బడా బజార్, బాబానగర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ దీపాలు, షామియానాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భగా ఒక రోజు ముందే మసీదులు, మైదానాలలో బహిరంగ సభలు నిర్వహించి ముస్లిం మతపెద్దలు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను అందరికి తెలియజేస్తారు. నేడు అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి. చార్మినార్ నుండి బారి ర్యాలీ తీయనున్నారు. ఇది గుల్జార్ హౌస్, పత్తర్ గట్టి, మదీనా, దారులు షిఫా, మీర్ అలం మండి, ఏతేబర్ చౌక్, కోట్లా అలీజా, మొఘల్ పుర ప్లే గ్రౌండ్ వరకు సాగుతుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

పండుగ సందర్భంగా ముస్లిం లు వారి ఇళ్లలో ఖీర్, పూరి, బగారా ఖానా, కుర్మా లాంటివి తయారీ చేసుకొని బంధువులు, స్నేహితులను వారి ఇంటికి ఆహ్వానించి వాళ్ళతో పంచుకుంటారు. అంటే ప్రతి పండుగ కూడా మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచడానికి, అందరు సమానం అని తెలియజేయడానికి, ముఖ్యంగా ఈరోజులలో పంచడం అలవాటు చేసుకోవడానికి పెద్దలు సాంప్రదాయంగా ఏర్పాటు చేసిన ఒక నియమం. దానిని ఇలా పండుగ రూపంలో జరుపుకోవడం తో అందరు తమ మధ్య భేదభావాలు మరిచి, తారతమ్యాలు మరిచి కలిసిపోవడం అలవాటు చేసుకుంటారు. ఇదే అసలు పండుగల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యం. అయితే వీటిని సహించని కొందరు చేసే మూర్కపు చర్యల వలన నేడు పండుగలు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు మధ్య జరుపుకోవాల్సి వస్తుంది.

తాజాగా జరిగిన ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ అనే కార్యక్రమంపై విద్యార్థి సంఘాలు అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నాయి. పాతబస్తిలో నిర్వహించిన ఈ కార్యక్రమం అక్కడ ఉన్న భిన్న వర్గాల సంస్కృతిని, సాంప్రదాయాలను దెబ్బతీసేదిగా ఉందని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు. చార్మినార్ వద్ద బాగ్యలక్షి దేవాలయం ఉంది, మక్కా మసీదు, దర్గాలు వంటి ఎన్నో సాంప్రదాయాలకు చెందిన పవిత్ర ఆరాధన స్థలాలు ఉన్నాయి, అలాంటి ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించడానికి, వ్యాపారాలు పెంచడానికో వేరే వారి సంస్కృతులను పాతబస్తీ పై రుద్దటం ఖండిస్తున్నట్టు వారు తెలిపారు. దీనిపై అధికారులు, నేతలు మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని వారు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: