
నిజానికి ఆమె బ్రిడ్జి పక్కన ఉన్న గోడను ఎక్కిన వెంటనే కొంతమంది చూసి ఫోన్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి విషాదకర సంఘటన జరగకూడదని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత ఆమెను ధైర్యంగా కాపాడారు. ఈ లాంగెస్ట్ సీ బ్రిడ్జికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ సంఘటన దృశ్యాలను రికార్డ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో కనిపించినట్లుగా పోలీసులు ఒక వాహనంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఒక్కొక్కరుగా బ్రిడ్జి పక్కన కట్టిన గోడ లాంటి నిర్మాణం పైకి ఎక్కడం చూడవచ్చు ఆ తర్వాత ఆ గోడ పైనుంచి వేలాడుతూ ఉన్న మహిళను పట్టుకొని పైకి లేపారు చాలా జాగ్రత్తగా ఆమెను బ్రిడ్జి మీదకు తీసుకొచ్చారు. ట్యాక్సీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ సకాలంలో పట్టుకుని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ షాకింగ్ ఇన్సిడెంట్ సాయంత్రం 7 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆమె ములుండ్ నివాసి అని తేలింది. ఆమెను కాపాడిన ట్యాక్సీ డ్రైవర్ పేరు సంజయ్ యాదవ్ (31). ఇక ఆమెను రక్షించిన పోలీసు కానిస్టేబుళ్ల పేర్లు లలిత్ అమర్‌షెట్, కిరణ్ మాత్రే, యశ్ సోనావణే. వీళ్లు ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను రక్షించారు కాబట్టి చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ మహిళను నవీ ముంబై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు తెలిసింది. దేవుళ్ళ ఫోటోలు నిమర్జనం చేయాలని తాను సముద్రంలోకి దూకడానికి ప్రయత్నించానని ఆమె చెప్పి షాక్ ఇచ్చింది.