వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. త‌న తండ్రిది హ‌త్యేనంటూ వివేకా కుమార్తె ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపై అయ్య‌న్న మాట్లాడుతూ జ‌గ‌న్ బాబాయి తనంతట తానే గొడ్డలిలతో పొడుచుకున్నాడా? అని మీరే గొడ్డలితో వేటు వేశారా ? అని విమర్శించారు. అన్న న్యాయం చేయ‌లేద‌ని ఓ చెల్లి తెలంగాణ‌లో రోడ్ల‌పై తిరుగుతుంటే.. మ‌రో చెల్లి ఏకంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో నినాదాలు చేస్తున్నారంటూ ఆయ‌న సెటైర్ వేశారు.

ఇక జ‌గ‌న్ అత్యంత భద్రత నడుమ జగన్ టీకా వేయించుకోవడం చూస్తేనే ప్రజలంటే ఎంత భయపడుతున్నారో అని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. సీబీఐ వాళ్లు వస్తున్నారట, విజ‌య‌సాయి ఇక హైద‌రాబాద్‌లో బెడ్లు సిద్ధం చేసుకోవాల‌ని ఎద్దేవా చేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: