
తెలుగు రాష్ట్రాలకు రెండు రాజధానులు ఉన్నా.. సినిమా రాజధాని మాత్రం ‘విజయవాడ’నే. ఎందుకంటే విజయవాడ సిటీలో జరిగే సినిమా బిజినెస్ స్థాయి అది. హైదరాబాద్ తర్వాత విజయవాడలో అత్యధిక ధియేటర్లు ఉన్నాయి. 90ల్లోనే విజయవాడలో 50కి పైగా సింగిల్ ధియేటర్లు ఉండేవి. ఏ సినిమా నిర్మాత, దర్శకుడైనా కొత్త సినిమా షో పడితే విజయవాడ టాక్ ఏంటి? అనే ఎంక్వైరీ చేస్తారు. ఫ్యాన్స్, అభిమాన సంఘాలు కూడా ఇక్కడే ఎక్కువ. కరోనా వల్ల ధియేటర్లు మూతబడ్డాయి. అన్ లాక్ లో భాగంగా పర్మిషన్స్ రావడంతో ఇప్పుడు విజయవాడలో ఈరోజు నుంచి ధియేటర్లు ఓపెన్ అయ్యాయి.
విజయవాడ వాసులకు ఇది గుడ్ న్యూస్. సింగిల్ స్క్రీన్లు కాకుండా మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. ఈనెల లేదా డిసెంబర్ లో కొత్త సినిమాల విడుదల వార్తల నేపథ్యంలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు, దుల్హర్ సల్మాన్ నటించిన కనులు కనులు దోచాయంటే.. సినిమాలు ప్రదర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీటింగ్ కేటాయించారు. బుక్ మై షోలో కూడా టికెట్స్ ఉంచారు. ఆక్యుపెన్సీ మరీ ఎక్కువగా లకపోయినా ప్రేక్షకులు ధియేటర్లకు అలవాటు పడేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు.

