టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఇంకా శ్రీకాంత్ ఓదెల  కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా 'దసరా'.ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మాములుగా లేదనే చెప్పాలి. ఈ టీజర్ లో నాని విశ్వరూపం చూడొచ్చు. ఈ టీజర్ ఒక్క సారిగా అంచనాలు పెంచేసింది.మార్చి 30 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పబ్లిసిటీ కార్యక్రమాలపై మూవీ యూనిట్ బాగా దృష్టి పెట్టింది. ఇక అందులో భాగంగా.. నాని 39వ పుట్టినరోజు (ఫిబ్రవరి 24)ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు మూవీ టీం ఇప్పుడు సిద్ధమైంది.ఈ సినిమాలో నాని కనబడే లుక్ లాగానే బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని కూడా మాసివ్‌గా ఒక రేంజిలో ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 39 లోకేషన్స్‌ని నాని బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఎంపిక చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. 


ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఇప్పుడు అభిమానులని పిచ్చెక్కించేస్తుంది. ఇందులో నాని లుక్‌ని చూసి అంతా కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ముందుంది మాస్ జాతర అంటూ నాని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.దసరా సినిమాతో నాని మేకోవర్‌ ఓ రేంజిలో వుంది. ఒక నటుడు తాను పోషించే పాత్రలో యాప్ట్, రియల్‌గా కనిపించేలా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మన యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని తన దసరా లుక్‌తో నిరూపించారు.'దసరా' సినిమాలో నాని రోజువారీ కూలీగా నటించారు. అందుకోసం అద్భుతమైన మేకోవర్ అయ్యారు. ఇక ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి  నిర్మిస్తున్న ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్  హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక చూడాలి నానికి ఈ సినిమా ఎంత పెద్ద ప్లస్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: