
ఇక వసూళ్ల విషయంలో కూడా ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండిస్తుంది. సాధారణంగా కమెడియన్ డైరెక్టర్ గా మారాడు అంటే చాలు అతని నుంచి ఏదో కామెడీ ఓరియంటెడ్ సినిమానే వస్తుందని అందరూ ఊహిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కమెడియన్ వేణు మాత్రం కన్నీరు పెట్టించే కథతో వచ్చి ప్రేక్షకుల గుండెను పిండేసాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా గుర్తుకు వస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాకు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించాడు.
అయితే ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నవేణు తన సినీ జీవితం గురించి చెప్పుకొచ్చాడు. ఇంటి నుంచిపారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇక ఎన్నో రోజులు కష్టపడిన తర్వాత ఒక చిన్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే ఛాన్స్ వచ్చింది. అంతకుముందు ఓ రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశాను. చిత్రం శ్రీను అన్న దగ్గర టచ్ అప్ బాయ్ గా కూడా చేరాను. దాదాపు 200 సినిమాల్లో నటించాను. అయితే అనుకున్న బ్రేక్ మాత్రం రాలేదు అంటూ కమెడియన్ వేణు చెప్పుకొచ్చాడు. నా తర్వాత వచ్చిన వాళ్ళు అవకాశాలు సాధిస్తే నేను మాత్రం వెనకే ఉండిపోయాను. కానీ ఇప్పుడు డైరెక్టర్గా సక్సెస్ అందుకున్నాను అంటూ తెలిపాడు.