ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోష్ లో కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోలు నటించిన ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు మళ్లీ రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించి అద్భుతమైన కలెక్షన్ లను సాధిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఆ కాలంలో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా ఆ సమయంలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయిన కొన్ని సినిమాలను కూడా ప్రస్తుతం రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆంధ్రావాలా మూవీ ను కూడా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ ఆ సమయంలో ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు బుల్లి తెరపై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను మార్చి 24 వ తేదీన మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది. మరి అప్పట్లో థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయిన ఆంధ్రావాలా సినిమా మరి రీ రిలీజ్ లో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ... పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన మొట్ట మొదటి సినిమా.  ఈ సినిమాకు చక్రి సంగీతం అందించగా ... రక్షితమూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: