సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాగా చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. బైక్ యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమా ఫంక్షన్ కు సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ హాజరు కాలేక పోగా ఆయన స్థానాన్ని పవన్ కళ్యాణ్ భర్తీ చేసే ప్రయత్నం చేశారు. అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి దిల్ రాజు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అలాగే హరీష్ శంకర్ లో ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

రిపబ్లిక్ డే సినిమా కు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పారు.  ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ స్పీచ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా గురించి సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎంత చక్కగా మాట్లాడింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. ఈ చిత్రం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దేవాకట్టా గారికి దగ్గరికి వెళ్తున్నాం.. ఆయన చిత్రం చేస్తున్నం అంటే అందరం స్కూల్ పిల్లల మారిపోయాం. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు చాలా థాంక్స్.

థియేటర్లోనే అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగు ప్రేక్షకులలా ఎవరు ఉండరు. నాకు కూడా విజిల్స్ వేస్తూ థియేటర్లో చూసేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని పేర్కొంది. ఈ చిత్రం దేవా కట్టా దర్శకత్వంలో అక్టోబర్ 1వ తేదీన రానుంది మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో చూడాలి. ఇక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎప్పుడు టాలీవుడ్ మొత్తం ఎంతో సంచలనం సృష్టిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్ టికెట్ల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని వారిని దుమ్మెత్తి పోశారు. మరి దీని ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై ఏ విధంగా పడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: