నటుడిగా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో షియజీ షిండే ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి , ఎన్నో పాత్రలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో షియజీ షిండే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని షియజీ షిండే నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే షియజీ షిండే కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే షియజీ షిండే సినిమాల్లోకి రాక ముందు ఏం పని చేసేవాడో తెలుసా ... షియజీ షిండే సినిమాల్లోకి రాక ముందు కాలేజీ చదువుతున్న రోజుల్లో ఉదయం మొత్తం కాలేజీలో చదువుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి రాత్రి పూట నైట్ వాచ్మెన్ గా పని చేసేవాడట.

ఇక అలా నైట్ వాచ్ మెన్ గా పని చేసినందుకు ఆయనకు నెలకు 165 రూపాయలు జీతం గా ఇచ్చేవారట. దానితో ఇంట్లో ఖర్చులకు ఆయన 150 రూపాయలు ఇచ్చి , కేవలం 15 రూపాయలు మాత్రం తన దగ్గర ఖర్చులకు ఉంచుకునే వాడట. అలా షియజీ షిండే సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు కాలేజీ చదువుతున్న రోజుల్లో 165 రూపాయల జీతం కోసం నైట్ వాచ్మెన్ గా పని చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: