ప్రత్యర్ధి పార్టీల వల్ల ఒకోసారి నష్టాలే కాదు లాభాలు కూడా ఉంటాయి. కరెక్ట్ గా ఇదే విధానంలో ఏపీలోని అధికార పక్షం వైసీపీ లాభపడేలా కనిపిస్తోందో. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీల చేస్తున్న రాజకీయాల వల్ల అధికారంలో ఉన్న జగన్ పై సానుభూతి పెరిగేలా ఉంది. ఎన్నికల ముందు వరకు పాము-ముంగిసల్లాగా కొట్లాడుకున్న టీడీపీ-జనసేన-బీజేపీలు...జగన్ సీఎం కాగానే కలిసిపోయినట్లున్నాయి. పైకి వేరు వేరు పార్టీల్లాగా కనిపించిన వీరు రాజకీయాలు  మాత్రం ఒకేలా ఉన్నాయి.

 

కేవలం జగన్ ని టార్గెట్ చేసుకునే వీరు వ్యూహాలు పన్నుతున్నారు. జగన్ అధికార పీఠం ఎక్కిందే మొదలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అసలు జగన్ అనేక ప్రజారంజక పథకాలు అమలు చేసిన చంద్రబాబు అండ్ కొ మాత్రం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. సరే టీడీపీ ప్రతిపక్షం కాబట్టి విమర్శలు చేస్తుంది అనుకోవచ్చు.

 

కానీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విమర్శలు చేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. ఈయన విమర్శలు కూడా టీడీపీకి కొనసాగింపుగానే చేస్తూ వచ్చారు. ఈ రెండు పార్టీలు ఒక ఎత్తు అయితే బీజేపీ ఒక ఎత్తు అయింది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని విమర్శించడమే పనిగా ఏపీ బీజేపీ నేతలు నడిచారు. అయితే ఈ విషయం జగన్ కు పూర్తిగా అర్ధమైంది.

 

అందుకే తాజాగా శత్రువులు ఏకమై తనపై  విరుచుకుపడుతున్నారని, అయినా సరే తాను పోరాడతానని మాట్లాడారు. ఇక ఈ విషయం జగన్ స్వయంగా చెప్పడంతో ప్రజలకు ప్రతిపక్షాల గురించి ఇంకా ఎక్కువ అర్ధమైంది. ఈ మూడు పార్టీలు కావాలనే రాజకీయాలు చేస్తున్నాయని, జగన్ పై విమర్శలు చేస్తున్నాయని చర్చలు చేసుకుంటున్నారు.

 

ఈ క్రమంలోనే ఇప్పటికే పథకాల ద్వారా జనానికి దగ్గరయ్యిన జగన్ పై ఈ మూడు పార్టీల రాజకీయంతో సానుభూతి కూడా పెరిగింది. ఏదైనా లిమిట్ గా విమర్శలు చేస్తే ప్రజలు అర్ధం చేసుకుంటారు. అలా కాకుండా అర్ధం పర్ధం లేకుండా మాట్లాడితే అధికార పక్షానికి మరింత దగ్గరవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: